Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?

మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Manish Sisodia,Aravind Kejriwal

Manish Sisodia,Aravind Kejriwal

Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. మద్యం కుంభకోణంలో బెయిల్‌పై విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. మనీష్ సిసోడియా బెయిల్ పై ఆప్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. 17 నెలల తర్వాత సిసోడియాకు బెయిల్ దక్కడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎమోషన్ అవుతున్నారు. అయితే సిసోడియా బయటకు రావడంతో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అతడేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇచ్చిన రియాక్షన్‌కు అనేక అర్థాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో 17 నెలలు జైలులో ఉన్నారు. ఇప్పుడు అతడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.కాగా మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిసోడియా, కేజ్రీవాల్ పర్సనల్ గా కూడా మంచి ఫ్రెండ్స్. దీంతో సిసోడియా సీఎం అవ్వడంతో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కూడా మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. మనీష్ సిసోడియాను 530 రోజుల పాటు కటకటాల వెనుక ఉంచారు. పేదల పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రియమైన పిల్లలూ, మీ మనీష్ మామయ్య తిరిగి వస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.

సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీం షరతులు విధించింది. తన పాస్‌పోర్టును సరెండర్ చేయాల్సి ఉంటుంది. మనీష్ సిసోడియా ప్రతి సోమ, గురువారాల్లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

Also Read: Realme 13 4G: అదిరిపోయే కెమెరా ఫీచర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ తో రియల్ మీ ఫోన్.. పూర్తి వివరాలివే?

  Last Updated: 09 Aug 2024, 01:07 PM IST