Site icon HashtagU Telugu

Bharat Jodo Nyay Yatra: రాహుల్‌కి ఝలక్ ఇచ్చిన మణిపూర్‌ ప్రభుత్వం

Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra

Bharat Jodo Nyay Yatra: రాహుల్‌ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్‌లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. .

గత ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సక్సెస్ కావడంతో కాంగ్రెస్ మరో యాత్రకు పూనుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ త్వరలో చెప్పనున్న యాత్రకు భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు. ఈ భారత్ న్యాయ్ యాత్రను మ‌ణిపూర్ నుంచి ముంబై వ‌ర‌కూ నిర్వహించాలని రాహుల్ నిర్ణయించారు. అయితే మణిపూర్‌ ప్రభుత్వం రాహుల్ కు షాకిస్తూ నిర్ణయం ప్రకటించింది. భారత్ న్యాయ్ యాత్ర చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

మణిపూర్‌ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ మండిపడింది. మణిపూర్ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఇది రాజకీయ ప్రయత్నం కాదని, యాత్రను రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు. శాంతిభద్రతలని సాకుగా చూపుతూ సీఎం అనుమతి నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ భారత్ న్యాయ్ యాత్ర‌ను కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. వాహ‌నాల‌తో పాటు పాద‌యాత్ర‌గా భార‌త్ న్యాయ యాత్ర సాగుతుంద‌ని హస్తం పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

Also Read: Chandrababu : ఎన్నికల సమయంలో చంద్రబాబుకు భారీ ఊరట..