Site icon HashtagU Telugu

Manipur : ఆ ఐదుగురిపై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందే – మ‌ణిపూర్ కాంగ్రెస్‌

Manipur Imresizer

Manipur Imresizer

బీజేపీలో చేరిన ఐదుగురు మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గత నెలలో అధికార బీజేపీలో చేరిన ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్‌లో అనర్హత పిటిషన్‌ను కాంగ్రెస్ దాఖలు చేసింది. మణిపూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు హరేశ్వర్‌ గోస్వామి, న్యాయవాది నింగోంబమ్‌ బుపెండ మైతేయ్‌తో కలిసి ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల‌ని కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం బీజేపీ శాసనసభా పక్షంలో ఐదుగురు జెడి-యు ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్ ఆమోదం తెలిపారని మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ తెలిపారు.

ఐదుగురు జేడీయూ శాసనసభ్యులు ఖుముక్చమ్ జోయ్‌కిసన్ సింగ్ (తంగ్‌మీబాండ్), న్గుర్‌సంగ్లూర్ సనేట్ (తిపైముఖ్), Md. అచాబ్ ఉద్దీన్ (జిరిబామ్), తంజామ్ అరుణ్‌కుమార్ (వాంగ్‌ఖీ),L.M. ఖౌటే (చురాచంద్‌పూర్)లు బీజేపీలో చేరారు ఫిబ్రవరి-మార్చి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీ-యూ 38 మంది అభ్యర్థులను నిలబెట్టి ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత, ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును అందించారు. ఆరవ ఎమ్మెల్యే ముహమ్మద్ అబ్దుల్ నాసిర్, లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఈ ఐదుగురు బీజేపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో ప్ర‌స్తుతం బీజేపీ బ‌లం 37కి పెరిగింది.