Site icon HashtagU Telugu

Mangaluru Auto Explosion: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే..!

New Project 2022 11 20t113929.398

New Project 2022 11 20t113929.398

తీరప్రాంత కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదని, తీవ్ర నష్టం కలిగించే ఉద్దేశంతో జరిగిన ఉగ్ర చర్య అని రాష్ట్ర పోలీసు చీఫ్ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ఏజెన్సీలతో పాటు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.ఈ కేసులో పోలీసులకు కేంద్ర దర్యాప్తు బృందాలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా తెలిపారు.

పేలుడులో గాయపడిన వ్యక్తి ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. పోలీసు బృందం మొత్తం సమాచారాన్ని సేకరిస్తోంది. దర్యాప్తులో ముందస్తు సంకేతాలు ఉగ్రవాద కార్యకలాపాలను సూచిస్తున్నాయి. మేము కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం అందించాము. వారు మంగళూరుకు ఒక బృందాన్ని పంపారు. రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితమైన సమాచారాన్ని మేము ఆశిస్తున్నాము” అని ఆయన చెప్పాడు.

కాగా.. ఆటో రిక్షాలో నుంచి పోలీసులు కాలిపోయిన ప్రెజర్ కుక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఆటో రిక్షా డ్రైవర్, ఓ ప్రయాణికుడు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. లొకేషన్‌లోని సిసిటివి విజువల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్న పేలుడు సంభవించిన తరువాత ఆటో రిక్షా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాట్లాడలేకపోతున్నారని సిటీ పోలీస్ కమిషనర్ శశి కుమార్ చెప్పారు. వదంతులను నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు.