NEET PG Exams : ‘టైమ్ బౌండ్ సెక్షన్ ’ విధానాన్ని నీట్ పీజీ-2024 పరీక్షల్లో చేర్చాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించింది. నీట్ పీజీతో పాటు నీట్ ఎండీఎస్ , నీట్ ఎస్‌ఎస్, ఎఫ్‌ఎంజీఈ, డీఎన్‌బీ పీడీసీఈటీ , జీపీఏటీ, డీపీఈఈ , ఎఫ్‌డీఎస్‌టీ , ఎఫ్‌ఈటీ పరీక్షల్లో ఈ కొత్త మార్పు అమల్లోకి రానుంది. నీట్-పీజీ 2024 పరీక్ష జూన్ 23న జరగనున్న నేపథ్యంలో మనం ‘టైమ్ బౌండ్ సెక్షన్ ’ విధానం గురించి తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- ‘టైమ్ బౌండ్ సెక్షన్స్’ విధానం అంటే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో సెక్షన్ల వారీగా సమయాన్ని కేటాయించే పద్ధతి.
- ఇందులో భాగంగా ప్రశ్నా పత్రాన్ని సెక్షన్ల వారీగా విభజించి, ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు.
- ఒక సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతే తదుపరి సెక్షన్ ఓపెన్ అవుతుంది.
Also Read :PM Modi : ఓటు వేసిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు కీలక సందేశం
- నీట్ పీజీ-2024(NEET PG Exams) పరీక్ష ప్రశ్నపత్రంలో A, B, C, D, E అనే టైమ్ బౌండ్ సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఇస్తారు.
- ఇచ్చిన టైంలోగా ఆయా సెక్షన్లను అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మరో సెక్షన్‌కు అభ్యర్థి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
- ప్రతీ సెక్షన్ కోసం అభ్యర్థులకు కేటాయించిన సమయం ముగిసిన తర్వాత.. అందులోని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను మార్చేందుకు వీలు ఉండదు. ఆ టైంలోగా సంబంధిత సెక్షన్‌లోని ప్రశ్నను రివ్యూ చేసుకొనేందుకు మార్కింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
Also Read :Ooty Update : నేటి నుంచి ఊటీ, కొడైకెనాల్‌కు వెళ్లే టూరిస్టులకు ఇవి తప్పనిసరి
నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్ కటాఫ్‌ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్ అనే విద్యార్ధి వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల నిరాకరించింది. కటాఫ్‌ను పొడిగించలేమని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అనుమతిస్తూ ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. కాగా, ఈ ఏడాది నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆగస్టు 15వ తేదీని ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.