Yogi Adityanath : నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు నటుడు విష్ణు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా విశేషాలు వారు పంచుకున్నారు. ఇక, ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. సీఎంకు థాంక్యూ చెప్పారు. కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆయన చేతుల మీదగా విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తుల్లో ఒకరైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఈరోజు కలిశాను అన్నారు.
Read Also: Gold Loan Rules: ఇకపై బంగారంపై రుణం సులభంగా లభించదా?
రమేశ్ గొరిజాల గీసిన అద్భుతమైన కళాఖండాన్ని ముఖ్యమంత్రి యోగికి కానుకగా అందించాం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ మోహన్‌బాబు సైతం పోస్ట్ పెట్టారు. మీ ఆతిథ్యానికి, ఆప్యాయతకు ధన్యవాదాలు సర్ అని రాసుకొచ్చారు. ఈ భేటీలో ప్రభుదేవా సైతం పాల్గొన్నారు. కాగా, జూన్ 27న ‘కన్నప్ప’ విడుదల కానుంది. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్న చిత్రమిది. ఏప్రిల్ 25న దీనిని విడుదల చేయాలని తొలుత టీమ్ భావించింది. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో జూన్ 27కు వాయిదాపడింది. ఇక, విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సిద్ధమవుతోంది. మోహన్‌బాబు, ప్రీతి ముకుందన్, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్, అక్షయ్‌కుమార్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.