Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ సంస్థలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన ఒక భావోద్వేగపు వీడియో రికార్డ్ చేసి, తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో కన్నీళ్లతో మానవ్ మాట్లాడుతూ, తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఆమె తరచూ అతనితో దురుసుగా ప్రవర్తించేదని, దీనితో ఆయన మానసికంగా తీవ్ర క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని వెల్లడించారు.
ఆ వీడియోలో, మానవ్ తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి, “పాపా, మమ్మీ, అక్కూ, సారీ… ఇక నేను వెళ్లిపోతున్నా” అని ఆవేదనతో పేర్కొన్నారు. అలాగే, సమాజంలో పురుషుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని, పురుషులు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తారని, మగవారి గురించి కూడా మాట్లాడాలని ఆయన అభ్యర్థించారు. వీడియో చివర్లో, ఆయన ఉరికి బిగించుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Former CJI Chandrachud: పూణే రేప్ కేసు నిర్భయ కేసును గుర్తు చేస్తుంది.. మాజీ CJI చంద్రచూడ్
మానవ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో, తన కొడుకు గత ఏడాది వివాహం చేసుకున్నారని చెప్పారు. పెళ్లి తర్వాత, మానవ్ తన భార్యను ముంబైకి తీసుకెళ్లి అక్కడ ఆమె తరచూ గొడవలు చేసేవారని, కుటుంబాన్ని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బెదిరించేదని పేర్కొన్నారు. అలాగే, ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి చివరలో మానవ్ తన భార్యను ఆగ్రాకు తీసుకువచ్చి, కొద్దిరోజుల తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. ఈ సమయంలో, ఆమె కుటుంబ సభ్యులు మానవ్‌ను బెదిరించి, ఆత్మహత్య చేసుకోవడానికి దారితీశారని, ఇది మానవ్ యొక్క మానసిక ఒత్తిడిని మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన ఇటు బెంగళూరులో జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును గుర్తుకు తెచ్చింది. అతుల్ కూడా తన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు కేసుల్లోనూ బాధితులు తమ భార్యలపై మానసిక, భావోద్వేగ వేధింపుల ఆరోపణలు చేశారు. మానవ్ శర్మ కేసులో, పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆయన భార్య , ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మానవ్ ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు పురోగతిపై మరింత సమాచారం త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Vasthu Tips: ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే ఈ 5 రకాల జంతువుల ఫోటోలు ఇంట్లో ఉండాల్సిందే!