Rahul Gandhi: రాహుల్ గాంధీకి బాంబ్ బెదిరింపు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్టు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ (Arrested) చేశారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 06:46 AM IST

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చంపుతానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ (Arrested) చేశారు. నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుడిని దయాసింగ్ అలియాస్ ఐషిలాల్ ఝమ్‌గా గుర్తించారు. భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని చంపుతానని ఐశీలాల్ బెదిరించడం గమనార్హం. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని బాంబుతో పేల్చేస్తానని ఐశీలాల్ ఝమ్ బెదిరించడం గమనార్హం. ఈ కేసులో విచారణ అనంతరం నిందితుడు ఐశిలాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండోర్‌లో బాంబులు పేలుస్తానని నిందితుడు బెదిరించారు. 2022లో నవంబర్ 18న నిందితుడు రాహుల్ గాంధీని బెదిరించారు. నవంబర్ 24న నిందితుడిను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నవంబర్ 29న నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. బెయిల్ తర్వాత, NSA చట్టం కింద ఇండోర్ పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.

Also Read: Karnataka polls: కన్నడ పాలిటిక్స్… అర్బన్ ఓటర్లు ఈ సారి ఎటువైపు..?

అందిన సమాచారం మేరకు నిందితుడు ఐశిలాల్ జామ్‌ను ఇండోర్ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. అతను 29 నవంబర్ 2022 నుండి పరారీలో ఉన్నాడు. నిందితుడి నుండి బెదిరింపు లేఖ ఓ స్వీట్ విక్రేతకు రావడం గమనార్హం. లేఖలో రాహుల్ గాంధీని చంపుతామని బెదిరించాడు. అలాగే, ఐశిలాల్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌పై అభ్యంతరకర రాతలు రాశాడు. గతేడాది నవంబర్‌లో ఈ లేఖ బయటపడగానే పోలీసులు ఐపీసీలోని 507 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మధ్య ప్రదేశ్ పోలీసులు అప్పుడే దర్యాప్తు ప్రారంభించారు.