Site icon HashtagU Telugu

Urinate : అర్జెన్సీ మూత్రం ఎంత పనిచేసిందో తెలుసా..?

Man Urinate

Man Urinate

అర్జెన్సీ మూత్రం (Urinate) ఓ వ్యక్తి కి ఏకంగా ఆరు వేల నష్టం చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన వర్షాలు పడుతున్నాయి. వర్షం పడుతుంటే కొంతమందికి మూత్రం తరుచు వస్తుంటుంది. ఆపుకోలేని విధంగా అవుతుంటుంది. తాజాగా ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఎదురుగా ఎక్కడ టాయిలెట్స్ లేవు..చేసేది ఏమిలేక వందే భారత్ రైలు (Vande Bharat Express) ఎక్కి తన పని పూర్తి చేసాడు. కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. తీరిగ్గా సదరు వ్యక్తి మూత్రం పొసే పనిలో ఉంటె..ట్రైన్ డ్రైవర్ మాత్రం ట్రైన్ ను స్టార్ట్ చేయడం చేసాడు. ఇంకేముంది లబోదిబోమంటూ సదరు వ్యక్తి ట్రైన్ ను ఆపండి..ఆపండి అంటూ ట్రైన్ లో పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు.

కానీ ఓసారి స్టార్ట్ అయినతరువాత మళ్లీ స్టేషన్ వచ్చేవరకు ట్రైన్ (Vande Bharat Express)ఆగదు కదా..తనకు సాయం చేయాలంటూ ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సాయం కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక టికెట్ లేకుండా ట్రైన్ ఎందుకు ఎక్కవు అంటూ టీసీలు రూ.1,020 జరిమానా వేశారు. ఆ డబ్బు కట్టిన తర్వాత ఉజ్జయిన్‌ స్టేషన్‌ రావడం తో ట్రైన్ ఆగింది. వెంటనే సదరు వ్యక్తి దిగి అక్కడి నుంచి బస్సు ద్వారా భోపాల్ వెళ్ళాడు. దానికి రూ.750 ఖర్చు పెట్టాడు. మరోవైపు తన భర్త వందేభారత్ ట్రైన్‌లో చిక్కుకోవడంతో ఆందోళనకు గురైన భార్య అతడు తిరిగొచ్చేవరకు రైల్వే స్టేషన్‌లోనే ఉంది. సింగ్రౌలి వెళ్లాల్సిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ కూడా ఎక్కలేదు. దీంతో రూ.4000 విలువైన టికెట్లు వృథాగా పోయాయి. మొత్తంగా అర్జెన్సీ మూత్రం కారణంగా అబ్ధుల్‌ అనే వ్యక్తి కి ఏకంగా రూ.6000 నష్టపోయాడు. ఇలా ఒక్కోసారి మనకు తెలియకుండానే ..మనం నష్టపోవాల్సి వస్తుంది.

Read also :CBN New Alliance : బీజేపీ, జ‌న‌సేన‌కు చంద్ర‌బాబు జ‌ల‌క్ ?