కాలం ఎవరిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెడుతుందో ఎవరికీ తెలియదు. కాలం ఆడే వింత నాటకంలో కొన్నిసార్లు మనం బలైపోతుంటాం. అలాంటి చిక్కు పరిస్థితే ఓ వ్యక్తికి ఎదురైంది. హాయిగా షికారుకు వెళ్లిన అతడు మనిషి కనిపించని ప్రదేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆహ్లాదం కోసం షికారుకు వచ్చిన సదరు వ్యక్తి ఆర్థనాదాలు చేస్తూ సాయం కోసం వేయి కళ్లతో చూస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రెడ్డిపేటకు చెందిన సింగరాయపల్లి రాజుకు షికారుకు వెళ్లాలని అనిపించింది. అలా జాలీగా షికారుకు వెళ్లి వద్దామని రాజు అనుకుంటే కాలం మాత్రం అతడి రాతలో వేరే రాసి పెట్టింది. అలా షికారుకు వెళ్లిన రాజు అలా ఆడుతూ పాడుతూ తిరిగాడు. కాసేపు అడవిలో జాలీగా పడిపాడు. ఆ తర్వాత అతడికి అనుకోని పరిస్థితి ఏర్పడింది.
సింగరాయపల్లి రాజు ఓ కొండ మీద నుండి అడవి అందాలను చూస్తూ ఉన్నాడు. అయితే అంతలోనే అతడు ఉన్నట్టుండి కాలు జారి కింద పడిపోయాడు. చుట్టూ వింతగా అనిపించింది, బయటకు వెళ్లడానికి రాజుకు దారి దొరకలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో రాజు కాసేపు దారి కోసం వెతుకుతూనే ఉన్నాడు.
రాజు కొండ మీద నుండి జారి ఓ గుహలో పడిపోయాడు. అయితే ఆ గుహ నుండి బయటకు రావడానికి మాత్రం అతడికి మార్గం కనిపించలేదు. ఇంతలో రాజు ఇంటి సభ్యులు అతడి గురించి భయపడటం మొదలుపెట్టారు. తెలిసిన వాళ్లను వెంట పెట్టుకొని అడవిలోకి రాగా.. రాజు ఓ గుహలో నుండి సాయం కోసం అరుస్తుండటం వారికి వినిపించింది. దీంతో రాజు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయగా.. పోలీసులు అతడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.