Trident in Neck: గొంతులో గుచ్చుకున్న త్రిశూలం.. ఆశ్చర్యపోయిన వైద్య బృందం!

గొంతులో గుచ్చుకున్న త్రిశూలంతో వైద్యం కోసం వ్యక్తి ప్రయాణం

  • Written By:
  • Publish Date - December 6, 2022 / 10:31 PM IST

చిన్నపాటి సూది గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం అలాంటిది ఒక వ్యక్తి గొంతులో ఏకంగా త్రిశూలం గుచ్చుకున్న ఎటువంటి బాధ లేకుండా 65 కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రిని చేరుకున్నాడు. ఆసుపత్రి వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సుమారు మూడు గంటల సమయంలో, గొంతులో గుచ్చుకున్న త్రిశూలంతో భాస్కర్ రావు ఎన్‌ఆర్‌ఎస్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చేరాడు.

అతని వాలకం చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కానీ అంతలా గొంతులో త్రిశూలం దిగబడి ఉన్న భాస్కరరామ్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం డాక్టర్లను షాక్ కు గురిచేసింది. అతని పరిస్థితి చూసి పరీక్ష చేసిన డాక్టర్ తో తనకు ఎటువంటి నొప్పి బాధ లేదని భాస్కరరామ్ వెల్లడించాడు. అతని మెడలో తిట్టినది 150 ఏళ్ల నాటి త్రిశూలం. దాని పొడవు ఇంచుమించు 30 సెంటీమీటర్లు ఉంది.

వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి భాస్కర్ రామ్ కు ఒక వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఆ వ్యక్తి కోపంతో భాస్కర్ రామ్ పై త్రిశూలం తో దాడి చేశాడు. ఆశూలం భాస్కర రామ్ మెడకు వెనుక భాగంలో లోతుగా దిగింది. సంఘటనా స్థలంలో జరిగిందంతా చూసిన భాస్కర రామ్ సోదరి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కానీ భాస్కర రామ్ మాత్రం 65 కిలోమీటర్లు ప్రయాణించి నేరుగా హాస్పిటల్ చేరుకున్నాడు.

నొప్పి లేకపోయినప్పటికీ పరిస్థితిలోని తీవ్రతను గ్రహించిన ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి రోగికి చికిత్సను అందించారు.అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణబాశిష్ బెనర్జీ నేతృత్వంలో డాక్టర్ అర్పితా మహంతి, సుతీర్థ సాహా, డాక్టర్ మధురిమ లాంటి నైపుణ్యం కలిగిన డాక్టర్ల బృందం భాస్కర రామ్ కు పరీక్షలు నిర్వహించి శాస్త్ర చికిత్స చేయడానికి నిర్ణయించుకున్నారు.

వెంటనే ఈఎన్‌టీ డాక్టర్ అయిన ప్రణబాసిస్ బెనర్జీ పర్యవేక్షణలో కొన్ని గంటల పాటు సాగిన శస్త్ర చికిత్స లో ఎంతో జాగ్రత్తగా త్రిశూలాన్ని తొలగించారు. భాస్కర్ రామ్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆ త్రిశూలం వాళ్ళ స్వగ్రామం లోని దేవుడి బలిపీఠం పై సుమారు 150 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటుందని తెలిపారు.