Site icon HashtagU Telugu

Unbelievable: 3 అంగుళాల ఎత్తు కోసం రూ. కోటి ఖర్చు..!

Cropped

Cropped

ఓ 68 ఏళ్ల వృద్ధుడు తన ఎత్తు పెరిగేందుకు ఏకంగా రూ.1.2 కోట్లు ఖర్చు చేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఢిల్లీకి చెందిన రాయ్‌ కాన్‌ (68) ఎత్తు పెరిగేందుకు రూ.1.2 కోట్లు ఖర్చు చేసి 3 అంగుళాల ఎత్తు పెరిగాడు. గతంలో 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న రాయ్‌ శస్త్రచికిత్స ద్వారా ౩ అంగుళాలు పెరిగి 5 అడుగుల 9 అంగుళాలకు పెరిగాడు. తన భార్య కోసమే ఎత్తు పెరిగేందుకు ప్రయత్నించానని రాయ్‌ తెలపడంతో ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది. శస్త్రచికిత్స ఎక్కువ సమయం పట్టిందని, రికవరీకి కూడా నెలలు పట్టిందని రాయ్‌ కాన్ చెప్పారు.

దీనిని కాస్మెటిక్ సర్జన్ కెవిన్ దేవిపర్షద్ నిర్వహించారు. అతను కాలు పొడవుగా పెంచడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. దేవిపర్షద్ లాస్ వెగాస్‌లో స్వంత క్లినిక్‌ని నడుపుతున్నాడు. అతని క్లయింట్‌లలో Google, Microsoft, Amazon, Meta ఉద్యోగులు ఉన్నారు. రోజుకు ఒక మిల్లీమీటర్ పడుతుంది కాబట్టి పొడిగింపు ప్రక్రియ నెలల్లో జరుగుతుందని డాక్టర్ దేబిపర్షద్ చెప్పారు. ఈ ప్రక్రియలో మూడు అంగుళాల పొడవు పెరగటానికి ఒక అంగుళం దాదాపు రెండున్నర నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టిందని ఆయన అన్నారు. ఎన్ని అంగుళాలు పెరగాలనుకుంటున్నారా అనేదానిపై చికిత్స ఆధారపడి ఉంటుందని, ఈ ప్రక్రియకు $70,000 నుంచి $150,000 మధ్య ఖర్చు అవుతుందని కాస్మెటిక్ సర్జన్ తెలిపారు.

 

Exit mobile version