Site icon HashtagU Telugu

Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్‌ను ఉపయోగించి మహిళా కళాశాల ప్రొఫెసర్‌గా నమ్మించి, సదరు గిరిజన బాలికలను లొంగదీసుకున్న ఘటనతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు నలుగురు మహిళలు మోసపోయామని ముందుకు వచ్చారని, మరో ముగ్గురిపై అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అందులో ఒక మహిళ మరియు ఆమె మైనర్ సోదరిని అటవీ ప్రాంతంలోకి రప్పించి అత్యాచారం చేశాడు. కాగా నిందితుడిపై పోక్సో చట్టం ప్రయోగించామని పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు యూట్యూబ్‌లో వాయిస్ చేంజ్ యాప్‌ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాయిస్ చేంజ్ యాప్‌ ద్వారా ఫిమేల్ వాయిస్ తో మహిళా ప్రొఫెసర్ అని నమ్మిస్తూ దారుణాలకు పాల్పడ్డాడు. వారికీ ప్రభుత్వ పథకాలతో వల వేసి నమ్మించి లోబర్చుకున్నాడు. ప్రశ్నించిన వారి మహిళల ఫోన్లను లాక్కుని బెదిరించేవాడు. రోజుకు 10-20 సార్లు మహిళలతో మాట్లాడేవాడు. స్కాలర్‌షిప్‌ల కోసమని నమ్మించేవాడని విచారణలో తేలింది. వారిని అడవికి రప్పించడానికి ప్రభుత్వ పథకాలతో నమ్మించేవాడని పోలీసులు పేర్కొన్నారు.

జనవరి నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయని, ప్రాణాలతో బయటపడిన ఇద్దరు తమ వద్దకు రావడంతో చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అతని కాల్ వివరాల రికార్డులను విశ్లేషించాము మరియు అతను పదేపదే కాల్ చేసిన ఫోన్ నంబర్‌లను సేకరించి బాధితుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Also Read: Bear Meat : ఉడకని ఎలుగుబంటి మాంసం.. తిన్నాక ఏమైందంటే..