Man Plays Piano : మ్యూజిక్ చేస్తూ..ఆపరేషన్ చేయించుకున్న పేషంట్..

ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సదరు పేషంట్ పూర్తి స్పృహతో ఉండాలి. అప్పుడే ఆ పేషంట్ మెదడు పనితీరు ఎలా ఉందో పర్యవీక్షించి ఆపరేషన్ చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - November 3, 2023 / 07:46 PM IST

ఆపరేషన్ (Operation) చేసే సమయంలో సదరు పేషంట్ కు అనస్తీషియా వేసి ఆపరేషన్ చేస్తుంటారు..కానీ అన్ని ఆపరేషన్లకు ఆలా చేయడం కుదరదు. అలాంటి ఆపరేషన్ లలో క్రానియోటమీ (Craniotomy ) ఒకటి. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సదరు పేషంట్ పూర్తి స్పృహతో ఉండాలి. అప్పుడే ఆ పేషంట్ మెదడు (Brain) పనితీరు ఎలా ఉందో పర్యవీక్షించి ఆపరేషన్ చేస్తుంటారు. ఇలాంటి ఆపరేషన్లు చేసేటపుడు డాక్టర్స్.. పేషంట్లకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. వాటిలో ప్రధానంగా మ్యూజిక్ ఒకటి. పేషంట్ కు నచ్చే పాటలు పెట్టి…వారికీ ఆపరేషన్ చేస్తారు. తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా ఓ యువకుడికి అలాగే చేసారు. కాకపోతే ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయాలే..సదరు పేషంటే మ్యూజిక్ ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎయిమ్స్ (AIIMS ) లో డాక్టర్స్ ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో డాక్టర్స్ ఆ యువకుడికి పరిస్థితిని వివరించారు. అయితే తనకు సంగీత వాయిద్యాలు కావాలని అడగటంతో.. డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లో సింథసైజర్ ను ఏర్పాటు చేశారు. సింథసైజర్ పై అతను మెలొడీ పాటలు ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. డాక్టర్స్ విజయవంతంగా అతని బ్రెయిన్ లో కణితను తొలగించారు. ఇంతక్లిష్టమైన ఆపరేషన్ ను పూర్తి స్పృహతో చేయించుకున్న అతని ధైర్యానికి డాక్టర్స్ ఫిదా అవుతూ..అతడికి హ్యాట్సాఫ్ చెప్పారు.

Read Also : Nagababu Emotional Tweet : నాగబాబు ఎమోషనల్ పోస్ట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా..