Site icon HashtagU Telugu

Ram Mandir Pran Pratishtha Ceremony : రామ మందిర ప్రాణప్రతిష్ట నేపథ్యంలో విషాదం..

Man Playing Hanuman Role Di

Man Playing Hanuman Role Di

అయోధ్య (Ayodhya) లో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట (Ram Mandir Pran Pratishtha Ceremony) కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకోగా..వేలాదిమంది VIP లు హాజరయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ వేడుకను లైవ్ ప్రసారాల ద్వారా వీక్షించారు. అలాగే దేశం నలుమూలల ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఆలయాల్లో బయటా.. అన్నదానాలు.. బాణాసంచా కాల్చి సంబురాలు.. రథయాత్రలు.. ఊరేగింపులు.. రామాయణ ఘట్టాల్ని నాటక రూపంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

హర్యానా (Haryana) భివానీ (Bhiwani )లో నిర్వహించిన ‘రామ్‌లీలా’ (Ramleela Program)లో హనుమంతుడి వేషధారణలో ఉన్న నటుడు రామ నామం జపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే ఆయన నటిస్తున్నారేమో అనుకుని అంతా చప్పట్లు కొట్టగా.. రాముడి వేషధారణలో ఉన్న నటుడు దగ్గరగా వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తో అంత షాక్ లో మునిగారు. రామ ప్రతిష్ట రోజు..అదికూడా హనుమాన్ వేషంలో అలరిస్తున్న వ్యక్తి ఇలా చనిపోవడం ఏంటి అని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

Read Also : Union Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? సర్వే ఎలా సిద్ధం చేస్తారు?