Grand Mothers Blood : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో దారుణం జరిగింది. గుల్షన్ గోస్వామి అనే 30 ఏళ్ల వ్యక్తి తన నానమ్మను త్రిశూలంతో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే త్రిశూలంతో పొడుచుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. మూఢనమ్మకాల వల్లే సదరు వ్యక్తి ఈ దారుణాలకు తెగబడ్డాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దుర్గ్ జిల్లా నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని నన్‌కట్టి గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
Also Read :Flex Fuel Bike : దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్.. ఫీచర్స్ అదుర్స్
గుల్షన్ గోస్వామి వయసు 30 ఏళ్లు. ఇతడు నన్‌కట్టి గ్రామస్తుడు. తన తాతయ్య 70 ఏళ్ల రుక్మణి గోస్వామి, నానమ్మతో కలిసి ఇంట్లో ఉంటున్నాడు. గుల్షన్ గోస్వామి శివ భక్తుడు. ఇంటి సమీపంలోని శివాలయానికి రోజూ వెళ్లి పూజలు చేసేవాడు. శనివారం సాయంత్రం(Grand Mothers Blood) ఇంట్లో ఉన్న త్రిశూలంతో పొడిచి తన అమ్మమ్మను గుల్షన్ గోస్వామి చంపేశాడు. అనంతరం అమ్మమ్మ రక్తాన్ని ఒక ప్లేటులో తీసుకెళ్లి.. శివాలయంలోని శివలింగానికి రక్తార్చన చేశాడు. వెంటనే ఇంటికి తిరిగొచ్చి.. త్రిశూలంతో తన మెడలో పొడుచుకున్నాడు. దీంతో మెడలోని రక్తనాళాలు పగిలిపోయి తీవ్ర రక్తస్రావం జరిగింది. అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక గుల్షన్ గోస్వామి అమ్మమ్మ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు. మూఢనమ్మకాల వల్లే నరబలి ఇవ్వడానికి తన అమ్మమ్మను గుల్షన్ మర్డర్ చేశాడని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పూర్తయ్యాక దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలోని రాష్ట్రాల్లో మూఢనమ్మకాల కట్టడికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే దీన్ని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కొట్టివేసింది. కేవలం పార్లమెంటు మాత్రమే అలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలదని సీజేఐ స్పష్టం చేశారు. అక్షరాస్యత పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు తగ్గిపోతాయని ఆయన కామెంట్ చేశారు.