Site icon HashtagU Telugu

Rajasthan Gang War: దారుణ ఘటన.. గ్యాంగ్ వార్‌లో ఓ వ్యక్తి మృతి

Cropped (2)

Cropped (2)

రాజస్థాన్ గ్యాంగ్‌ వార్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ రాజు థెట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు కాల్పుల్లో చనిపోగా, మరోకరు గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల నివేదిక ప్రకారం శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గ్యాంగ్‌స్టర్‌ రాజు ఇంటివద్దే నలుగురు వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ గ్యాంగ్‌వార్‌లో కోచింగ్‌ సెంటర్‌ లో ఉన్న తన కుమార్తెను కలవటానికి వచ్చిన ఓ వ్యక్తి మరణించాడు.

శనివారం గ్యాంగ్ వార్ మధ్యలో బుల్లెట్ల పేలుళ్లతో రాజస్థాన్ దద్దరిల్లింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ రాజు తేహత్ (రాజు తేత్ హత్య కేసు)ని కాల్చి చంపారు. ఈ ఘటనలో వీడియో తీసిన మరో వ్యక్తిని దుండగులు కాల్చిచంపారు. అతడు వీడియో తీస్తున్నట్లు దుండగులు చూశారు. ఆ తర్వాత వీడియో తీస్తున్న వ్యక్తిని వెంబడించిన దుండగులు అతడిని కూడా కాల్చి చంపారు. అనంతరం మృతుడి ఆల్టో కారును దుండగులు దోచుకెళ్లి పారిపోయారు. మృతుడు తారాచంద్ కద్వాసర్ నాగౌర్ నివాసి. ఏ ముఠాతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించలేదు.

మృతుడు తారాచంద్ కద్వాసర దేగానా ప్రాంతంలోని దోటినా గ్రామానికి చెందినవాడు.  కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న తన కుమార్తెను కలవటానికి వచ్చినట్లు సమాచారం. ఇంతలో ఈ సంఘటన మొత్తం అతని ముందు జరిగింది. తారాచంద్ తన మొబైల్‌లో ఘటనను రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అతడు వీడియో తీస్తున్నాడని చూసిన దుండగులు అతడిని కాల్చి చంపి, ఆయన కారును దోచుకెళ్లి పారిపోయారు. కొణిత భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన తండ్రి తారాచంద్ కద్వాసర భుజాలపై బాలిక ఏడుస్తున్నట్లు కనిపించింది.

మృతుడు తారాచంద్ కద్వాసర్ బంధవు కూడా ఈ కాల్పులలో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అనేక హాస్టళ్లు, కోచింగ్‌ సెంటర్లు ఉ‍న్నాయి. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ థెట్‌ సోదరుడు కూడా ఇక్కడే హాస్టల్‌ నడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తారాచంద్ గత రెండేళ్లుగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షకు సిద్ధమవుతున్న తన కుమార్తె కొణితను కలవటానికి కోచింగ్ సెంటర్‌కు వచ్చారు.