దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం రెండో దశ ప్రారంభమైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీని వ్యతిరేకంగా మంగళవారం గట్టిగా నిరసన వ్యక్తం చేశారు కోల్‌కతా నగరంలోని రెడ్ రోడ్డులోని డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్దనుంచి జొరాసాంకో ఠాగూర్ బారి వరకు సుమారు 3.8 కిలోమీటర్ల మేర వేలాది మంది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మహిళలు, విద్యార్థులు, కూలీలు, పార్టీ నాయకులు బరీగా పాల్గొన్నారు. మమతా బెనర్జీ తన చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని “ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించే చర్యలను రాష్ట్రం సహించదు” అంటూ నినాదాలు చేశారు.
Team India Squad: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. త్వరలోనే టీమిండియా జట్టు ప్రకటన?!
SIR పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల జాబితా సవరణ పేరుతో ఉపయోగించుకుంటుందనే విమర్శలను మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. ఆమె హెచ్చరిస్తూ, ఈ చర్య ద్వారా ఓటర్లను వివక్షతకు గురిచేయడం, ముఖ్యంగా మైనారిటీలను జాబితా నుండి తొలగించడమే అసలు ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తూ, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. “బెంగాల్ ప్రజలను భయపెట్టడం ఎవరూ సాధించలేరు. ఎన్నికల హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు; దీన్ని హరిస్తే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం,” అని మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ నేతలు కూడా ఈ నిరసనకు స్వరమిస్తూ, జిల్లా మరియు మండల స్థాయిలో కూడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
Jubilee Hills Bypoll : మైనారిటీలకు శక్తినిచ్చే సామర్థ్యం కాంగ్రెస్‌కే సాధ్యం – ఉత్తమ్
దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండవ దశ SIR ప్రారంభమయ్యింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ రివిజన్ ఉద్దేశం ఓటర్ల వివరాలను సరిచూడడం, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడం అని పేర్కొన్నా, బహుళ రాజకీయ పక్షాలు దీనిని రాజకీయ ఉద్దేశ్యాలతో అమలవుతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య ఉన్న విభేదాలు ఈ అంశంపై మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా బెనర్జీ ఈ నిరసనను “ప్రజాస్వామ్య రక్షణ యాత్ర”గా అభివర్ణిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపు నిచ్చారు. “ఎన్నికల జాబితాల సవరింపులో మానవ హక్కులు, సమానత్వం, పారదర్శకత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
