Mamata Banerjee : టీమ్ ఇండియా క్రికెటర్స్ కు తగిలిన కాషాయ రంగు సెగ

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత క్రికెట్ జట్టుతో సహా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలను కాషాయ రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తోందని మమతా ఆరోపించారు

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 12:00 PM IST

సాధారణంగా రాజకీయ నేతలకు , సినీ స్టార్స్ కు నిరసన సెగలు ఎదురవుతుంటాయి. కానీ ఇప్పుడు టీమ్ ఇండియా క్రికెటర్లకు సైతం నిరసన సెగ ఎదురువుతుంది. అది కూడా రాజకీయ నేతల నుండి. ప్రస్తుతం వరల్డ్ కప్ (World Cup 2023 ) చివరికి చేరింది..మరికొద్ది గంటల్లో వరల్డ్ కప్ 2023 విజేత ఎవరో తేలిపోతుంది. సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా (India) ఫైనల్ మ్యాచ్ లో కూడా విజయం సాధించాలని యావత్ భారతీయులు కోరుకుంటున్నారు.

ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ (IND vs AUS Final Match) జరగనుంది. ఈ మహా సంగ్రామాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అభిమానులు భారీ స్థాయిలో అహ్మదాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే హోటళ్లు, పలు రెస్టారెంట్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశాయి. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోడీ సైతం హాజరు కానున్నట్లు వినికిడి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఉంటె..పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee), బీజీపీ పార్టీ (BJP) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత క్రికెట్ జట్టుతో సహా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలను కాషాయ (saffron ) రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తోందని మమతా ఆరోపించారు. సెంట్రల్ కోల్‌కతాలోని పోస్టా బజార్‌లో జగద్ధాత్రి పూజ ప్రారంభోత్సవంలో బెనర్జీ మాట్లాడుతూ.. క్రికెట్ జట్టు ప్రాక్టీస్ జెర్సీలలో మాత్రమే కాకుండా మెట్రో స్టేషన్ల పెయింటింగ్‌లో కూడా బిజెపి కాషాయ రంగును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. బీజేపీ దేశమంతటా కాషాయ రంగుతో నింపేయాలని ప్రయత్నిస్తున్నారు. మన భారత ఆటగాళ్లను చూసి మేము గర్విస్తున్నాము. ప్రపంచ కప్‌ గెలుస్తారని మేము నమ్ముతున్నాము. కానీ వారు (బిజెపి) అక్కడ కూడా కాషాయ రంగులను తీసుకువచ్చారు. భారత క్రికెటర్లందరూ కుంకుమపువ్వు రంగులో ఉన్న జెర్సీలలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్‌లకు కుంకుమ రంగు పూశారు అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Read Also : BRS Party: కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బాలకిషన్ యాదవ్