NITI Aayog Meeting: చంద్రబాబుకు 20 నిమిషాలు, నాకు 5 నిమిషాలా?

చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్ సీఎంలు 10-12 నిమిషాలు మాట్లాడారని, ఐదు నిమిషాల తర్వాత నా మైక్ ఆఫ్ చేశారని ధ్వజమెత్తారు.

NITI Aayog Meeting: నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే ఆమె ఆగ్రహంతో సమావేశాన్ని వదిలి బయటకు వెళ్లిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో నా అభిప్రాయాలను తెలియజేస్తున్నప్పుడు, నా మైక్ స్విచ్ ఆఫ్ చేశారని ఆవేదన చెందారు. నన్ను ఎందుకు మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. నేను ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం సంతోషించాలను ఆమె సూచించారు. నీటి ఆయోగ్ సమావేశంలో ప్రభుత్వం తన పార్టీ నాయకులకు ఎక్కువ మాట్లాడటానికి స్కోప్ ఇస్తోంది, ప్రతిపక్షం నుండి నేను మాత్రమే ఉన్నాను. మీరు నన్ను మాట్లాడకుండా ఆపుతున్నారు. ఈ చర్య బెంగాల్‌ను మాత్రమే కాకుండా ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలను బీజేపీ అవమానిస్తుందని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడుకు మాట్లాడేందుకు 20 నిమిషాలు ఇచ్చారని ఆమె చెప్పారు. అస్సాం, గోవా, ఛత్తీస్‌గఢ్ సీఎంలు 10-12 నిమిషాలు మాట్లాడారని.కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంపై నాకు ఎక్కువ ఆసక్తి ఉందని, నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేవని చెప్పిన మమతా ఐదు నిమిషాల తర్వాత నా మైక్ ఆఫ్ చేశారని బ్ఫ్ గవర్నమెంటుపై ధ్వజమెత్తారు.

నీతి ఆయోగ్ ఈ సమావేశంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టి సారించింది. పాలక మండలి అనేది నీతి ఆయోగ్ యొక్క అత్యున్నత సంస్థ. ఇందులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది.

Also Read: Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా కోసం పోరాడుతున్న అమిత్‌, నిశాంత్‌..!

Follow us