Site icon HashtagU Telugu

Mamata Banerjee: ప్ర‌మాదంపై స్పందించిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం.. డ్రైవ‌ర్ లేకుంటే ప్రాణాలు పోయేవ‌ని ఎమోష‌న‌ల్‌..!

CM Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయమైంది.వర్ధమాన్‌లో సమావేశమై ముఖ్యమంత్రి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన వెలువడింది. ప్రజల ప్రార్థనల వల్లే నేను క్షేమంగా ఉన్నానన్నారు. నా డ్రైవర్ సమయానికి బ్రేకులు వేయకపోతే, నేను బ్రతికి ఉండేదాన్ని కాదేమో అని ఎమోష‌న‌ల్ అయ్యారు.

ప్రమాదం జరిగిన తర్వాత సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నా కాన్వాయ్‌ రోడ్డు గుండా వెళుతుండగా మరో వైపు నుంచి వచ్చిన కారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కాన్వాయ్‌పైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ స‌మ‌యంలో నా కారును ఢీకొట్టబోతున్నారు. కానీ నా డ్రైవర్ వెంటనే బ్రేకులు వేశాడు. దీంతో నా తల కారు డ్యాష్‌బోర్డ్‌కు తగిలింది. దీంతో నా నుదిటిపై గాయమైంది. నా డ్రైవర్ బ్రేకులు వేయకపోతే నేను ప్ర‌మాదానికి గుర‌య్యే అవకాశ‌ముంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నానని అన్నారు.

Also Read: Union Budget 2024: బడ్జెట్ కి ముందు నిర్మలా సీతారామన్‌ హల్వా వేడుక

ప్రమాదానికి కారణమేంటి?

ప్రమాదం జరిగిన సమయంలో సీఎం మమతా బెనర్జీ డ్రైవర్ పక్కనే ముందు సీటులో కూర్చున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆమె తల విండ్‌స్క్రీన్‌కు తగిలింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. బర్ధమాన్‌లో పరిపాలనా సమీక్షా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి కోల్‌కతాకు తిరిగి వస్తున్నట్లు అధికారి తెలిపారు. కానీ రహదారిపై పొగమంచు తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయనుంది

లోక్‌సభ ఎన్నికల కోసం సీఎం మమతా బెనర్జీ చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆమె నిరంతరం పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మమత బుధవారం ప్రతిపక్ష కూటమి ఇండియాకి షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌కు ప్రతిపాదన చేశానని, అయితే వారు మొదట్లో తిరస్కరించారని మమత చెప్పారు. బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని మా పార్టీ నిర్ణయించిందని ఆమె పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.