TMC MP : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాదని, మమతా బెనర్జీ(Mamata Banerjee) తదుపరి ప్రధాని(Next Prime Minister) అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ(Trinamool Congress MP) సౌగతా రాయ్(Saugata Roy) ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న అస్పష్ట తీర్పు వెలువడనుందని, 30 మందికి పైగా ఎంపీలతో మమతా బెనర్జీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని అన్నారు. మూడు సార్లు ఆమె విజయవంతంగా సీఎం బాధ్యతలు నిర్వర్తించడం కూడా దీదీకి కలిసివస్తుందని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక నాలుగోసారి పార్లమెంట్ ఎన్నికల్లో తలపడుతున్న సౌగతా రాయ్ తన విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాలుగోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచానని, తాను గతంలో ఓ సారి బారక్‌పూర్ నుంచి కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని చెప్పారు. తాను 1977లో తొలిసారి ఎంపీ అయిన క్రమంలో చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజ నేతలను చూశానని, ఇవాళ మీరు అలాంటి గొప్ప నేతలను చూడలేరని సౌగతా రాయ్ పేర్కొన్నారు.
Read Also: AP Elections 2024: ఏపీ మందుబాబులకు బిగ్ షాక్
రోజులు మారాయని, తాను తొలినాళ్లలో సీనియర్ నేతలను సలహాల కోసం సంప్రదించేవాడినని, ఇప్పుడు గూగుల్ అంకుల్‌ను ఆశ్రయిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాం విలాస్ పాశ్వాన్, శరద్ పవార్ వంటి తన పాత సహచరుల పిల్లలు ఇప్పడు తన కొలీగ్స్ అని చెప్పారు. 75 ఏండ్లు దాటినవారిని బీజేపీ పక్కన పెడుతున్నాదని, ఎల్‌కే అద్వానీని అలాగే తప్పించారని అన్నారు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటే ఆయా నేతలు దేశానికి అవసరమని, ప్రజామోదం ముఖ్యమని సౌగతా రాయ్ అన్నారు.