Mamata Banerjee : కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ

లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee Big Shock To Congress ) ఇండియా కూట‌మికి భారీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని..కాంగ్రెస్ తో పొత్తు అనేది లేదని స్పష్టం చేసి గట్టి షాక్ ఇచ్చింది. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ (Congress)తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని మమతా తెలిపారు. బెంగాల్ లోని 42 లోక్ సభ నియోజకవర్గాల్లో […]

Published By: HashtagU Telugu Desk
Mamatha Bigshcok

Mamatha Bigshcok

లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee Big Shock To Congress ) ఇండియా కూట‌మికి భారీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని..కాంగ్రెస్ తో పొత్తు అనేది లేదని స్పష్టం చేసి గట్టి షాక్ ఇచ్చింది.

బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ (Congress)తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని మమతా తెలిపారు. బెంగాల్ లోని 42 లోక్ సభ నియోజకవర్గాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని వివరించారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రపైనా కూడా మమతా విమర్శలు కురిపించారు. బెంగాల్ లోకి యాత్ర ఎంటర్ కాబోతోందని గుర్తుచేస్తూ కూటమి భాగస్వామిగా ఉన్న తమకు మర్యాదపూర్వకంగా కూడా సమాచారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. దీంతో రాహుల్ గాంధీ యాత్రలో మమత పాల్గొనడం సందేహాస్పదంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో తృణమూల్‌ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సీట్లను మమత ఆఫర్ చేశారని, మరిన్ని సీట్లు కావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలతోనే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తాజా ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also : BRS MLAs: రేవంత్ ను కలవడం వెనుక అసలు ఉద్దేశ్యమిదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్లారిటీ!

  Last Updated: 24 Jan 2024, 02:03 PM IST