Lok Sabha Election : భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు .. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు అని.. ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi)కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి (BJP)గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని పేర్కొన్నారు. రష్యాను పుతిన్‌ పరిపాలిస్తున్నట్లుగా, భారత్‌ను బిజెపి పాలిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర […]

Published By: HashtagU Telugu Desk
Mallikarjun Kharge

Mallikarjun Kharge

మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పార్లమెంట్ కు ఇవే చివరి ఎన్నికలు అని.. ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi)కూడా దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటాడని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి (BJP)గెలిస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని పేర్కొన్నారు. రష్యాను పుతిన్‌ పరిపాలిస్తున్నట్లుగా, భారత్‌ను బిజెపి పాలిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నియంతృత్వాన్ని అరికరడదామని తెలిపారు. ఎందుకు ప్రజలు ఇండియా కూటానికి మద్దతుగా నిలవాలని మల్లికార్జున ఖర్గే ప్రజలను కోరారు. ఒడిస్సా లోని భువనేశ్వర్ లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారతదేశాన్ని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్ర చేస్తున్నారు. కానీ బిజెపి నాయకులు మాత్రం నఫరత్ కి దుకాన్ కు తెరతీశాయని విమర్శించారు. అలాగే ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికీ బిజెపి ప్రభుత్వం ఏది అధికారులతో కలిసి నోటీసులు జారీ చేస్తున్నట్లు గుర్తు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇస్తున్నారని… ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భయం వల్లే కొంతమంది I.N.D.I.A. కూటమి నుంచి… మరికొందరు పార్టీ నుంచి వెళుతున్నారన్నారు. ‘ఇదే మీకు చివరి అవకాశం.. ఓటు వేయండి… దీని తర్వాత మోదీ గెలిస్తే ఓటింగ్ ఉండదు’ అని వ్యాఖ్యానించారు. బిజెపిని, ఆ పార్టీ సైద్ధాంతిక సంస్థ ఆరెస్సెస్‌ను విషంగా ఖర్గే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నారని… తాను ‘మొహబ్బత్ కీ దుకాన్’ను ప్రారంభించానని చెప్పారని గుర్తు చేశారు. కానీ బిజెపి, ఆరెస్సెస్‌లు ‘నఫ్రత్‌కీ దుకాన్‌’కు తెరదీశారని ఆరోపించారు. ఈ కారణంగా మీరు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బిజెపి, ఆరెస్సెస్‌లు విషపూరితమని… అవి మన హక్కులను హరిస్తున్నాయన్నారు.

మరోవైపు ప్రధాని నరేంద్రమోడీతో ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఉన్న స్నేహంపై విమర్శలు గుప్పించారు. మోడీతో స్నేహం వల్ల నవీన్ పట్నాయక్‌కు ఏం లాభం జరిగింది? డబుల్ ఇంజిన్ ఒక్కసారి ఫెయిల్ అవుతోందన్నారు. I.N.D.I.A. కూటమి నుంచి నితీశ్ కుమార్ వెళ్లిపోవడం గురించి స్పందిస్తూ… ఒక్కరు వెళ్లిపోయినంత మాత్రాన ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. ఒక్కరు పోయినా పోయేదేమీ లేదని… వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Ganja Chocolates : చాక్లెట్ల అవతారమెత్తిన గంజాయి.. ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్

  Last Updated: 30 Jan 2024, 11:59 AM IST