Site icon HashtagU Telugu

Senthil Balaji Arrest: తమిళనాడు మంత్రి అరెస్టు కేవలం ప్రతీకార చర్య: ప్రతిపక్షాలు

Senthil Balaji Arrest

New Web Story Copy (66)

Senthil Balaji Arrest: తమిళనాడులో మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు సెంథిల్ అధికారిక నివాసం, సెక్రటేరియట్‌లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సెంథిల్ అరెస్ట్ తర్వాత తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. సెంథిల్ బాలాజీపై జరిగిన ఈడీ దాడిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక బ్యాక్ డోర్ ద్వారా భయపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్టాలిన్ అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ తీరుపై మండిపడింది.

ఈడీ చర్యను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు ఖర్గే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా ఈడీ చర్యను వ్యతిరేకించింది. ఇది పూర్తిగా ప్రతీకార చర్యగానే చూసారు టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్. ఇదిలా ఉండగా.. ఈడీ చర్యను బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే స్వాగతించింది. ఎఐఎడిఎంకె నేత డి జయకుమార్ మాట్లాడుతూ ఈడీ తన పనిని చట్టబద్ధంగా చేసిందని అన్నారు.

https://twitter.com/ANI/status/1668737885242286080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1668737885242286080%7Ctwgr%5E3701c58b3b6d665c3fc9608514ddeeed6deb26f2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fpolitics-news-hindi.html

మంత్రి వి.సెంథిల్ బాలాజీని విచారించేందుకు గత నెలలో సుప్రీం కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగాల కోసం జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు పోలీసులకు మరియు ఈడీకి అనుమతిచ్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత నెలలో బాలాజీకి సన్నిహితంగా ఉండే వ్యక్తుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది.

Read More: Kontham Tejaswini: లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువతి