Site icon HashtagU Telugu

Maldives Vs India : ఇండియాను వివరణ కోరిన మాల్దీవ్స్.. ఎందుకో తెలుసా ?

India- Maldives

India- Maldives

Maldives Vs India :  మాల్దీవుల దేశం భారత్‌కు వ్యతిరేకంగా వేగంగా పావులు కదుపుతోంది.  తాజాగా తమ దేశానికి చెందిన ఫిషింగ్‌ బోట్లను భారత సైనిక బలగాలు అడ్డుకున్నాయని ఆ దేశం ఆరోపించింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరణ ఇవ్వాలని  భారత ప్రభుత్వాన్ని మాల్దీవులు కోరింది. ఈమేరకు ఆ దేశ విదేశాంగశాఖ.. భారత విదేశాంగ శాఖకు  అధికారికంగా ఒక లేఖను రాసింది. జనవరి 31న ప్రత్యేక వాణిజ్య జోన్‌ (ఈఈజెడ్‌)లో మాల్దీవులకు చెందిన మూడు ఫిషింగ్‌ బోట్లను ఇండియన్‌ కోస్టు గార్డు దళాలు అడ్డగించాయని ఆరోపించింది. ‘‘మా దేశ ప్రాదేశిక జలాల్లో మత్స్యకారులు చేపల వేట చేస్తుంటే భారత సైనిక బలగాలు ఎందుకు అడ్డుకున్నాయి ? ఆ అవసరం ఎందుకు వచ్చింది ?’’ అని ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మాల్దీవుల ఈఈజడ్‌ పరిధిలో చేపల వేట నిర్వహిస్తున్న బోట్లను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాలను ఉల్లంఘించి ఎందుకు అడ్డగించాల్సి వచ్చిందో మాకు తెలియజేయండి. భారత కోస్టుగార్డుకు చెందిన 246, 253 బృందాలు ఈవిధమైన చర్యలకు పాల్పడ్డాయి’’ అని లేఖలో(Maldives Vs India) వివరించింది.  దీనిపై ఇప్పటివరకు భారత్‌ ఇంకా స్పందించలేదు.

We’re now on WhatsApp. Click to Join

మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్‌ ముయిజ్జు ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి భారత్‌తో ఆ దేశం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత్ సైనిక బలగాలు 2024 మార్చిలోగా తమ దీవులను వదిలివెళ్లాలని అధ్యక్షుడు ముయిజ్జు  ఇటీవల డెడ్ ‌లైన్  కూడా విధించారు.  మాల్దీవుల గత అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలిహ్‌ భారత్‌ అనుకూల విధానాలను అవలంభించేవారు. ముయిజ్జు మాత్రం చైనా బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా పరిశోధక నౌకను కూడా మాల్దీవుల సముద్ర జలాల్లోకి ఆయన అనుమతించారు. దీనిపై భారత్‌ అభ్యంతరం వ్యక్తంచేయగా.. తమ అనుమతితోనే వచ్చిందని చైనాను వెనకేసుకొచ్చారు.

Also Read : LK Advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్

ఇటీవల పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. మాల్దీవులకు సహాయ సహకారాలు అందిస్తామని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హాక్ కాకర్ వెల్లడించారు. భారత్‌ను వ్యతిరేకిస్తున్నందు వల్లే మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ ముందుకు రావడం గమనార్హం. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్.. తాజాగా మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మాల్దీవులు అభివృద్ధికి పాకిస్థాన్ సహాయం చేస్తుందని.. పాక్ తాత్కాలిక ప్రధాని హామీ ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన భారత్‌తో మాల్దీవులకు జరుగుతున్న దౌత్య వివాదం నడుస్తున్న వేళ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. సహాయం కోసం ప్రపంచ దేశాలు, ప్రపంచ సంస్థల ముందు అడుక్కుంటోంది. అలాంటి పాకిస్థాన్ మాల్దీవులకు సాయం చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది.