Visa Free Entry : మన ఇండియన్స్ డిసెంబరు 1 నుంచి వీసా లేకుండానే నేరుగా ఒక దేశానికి వెళ్లిపోవచ్చు. ఏ దేశమో తెలుసా ? మలేషియా !! ఔను.. ఈవిషయాన్ని స్వయంగా మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి చైనా, భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. తమ దేశానికి వచ్చే ఇండియన్స్, చైనీస్ 30 రోజుల పాటు ఉండొచ్చని చెప్పారు. అయితే ఎంతకాలం పాటు ఈ వెసులుబాటు ఉంటుందనే విషయాన్ని మాత్రం మలేషియా ప్రధాన మంత్రి చెప్పలేదు. మలేషియా పీపుల్స్ జస్టిస్ పార్టీ సభలో ప్రసంగిస్తూ ఈవివరాలను అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. మలేషియాతో వాణిజ్య సంబంధాలు కలిగిన అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నాలుగో స్థానంలో చైనా, ఐదో స్థానంలో భారత్ ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో మలేషియాకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 91 లక్షల మంది పర్యాటకులు వెళ్లారు. చైనా నుంచి 4.98 లక్షల మంది, భారత్ నుంచి 2.83 లక్షల మంది టూరిస్టులు అక్కడికి వెళ్లారు. దీన్నిబట్టి ఇండియా టూరిస్టులు మలేషియా ఎంతటి ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో చివరి నెల(డిసెంబరు) కావడంతోనే టూరిజానికి మరింత ప్రోత్సాహాన్ని కల్పించేందుకు వీసా లేకుండా భారతీయులు, చైనీయులకు ఎంట్రీ కల్పించాలని మలేషియా(Visa Free Entry) నిర్ణయించిందని సమాచారం.
