Sasnkrit : స్కూళ్లలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి.. గుజరాత్ విద్యాశాఖ మంత్రికి ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక నిర్ణయం తీసుకోవాలంటూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందట.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 12:10 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక నిర్ణయం తీసుకోవాలంటూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందట. 1వ తరగతి నుంచే అన్ని తరగతుల స్టూడెంట్స్ కు సంస్కృతాన్ని తప్పనిసరి సబ్జెక్టు చేయాలని ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేస్తోందట. గుజరాత్ విద్యా శాఖ మంత్రి జితు వాఘాని , విద్యా శాఖ ఉన్నతాధికారులను కలిసి ఈమేరకు విజ్ఞాపన చేసినట్లు సమాచారం. విద్యా శాఖ మంత్రిని కలిసిన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల జాబితాలో విద్యా భారతి, శైక్షిక్ మహా సంఘ్, సంస్కృత భారతి, భారతీయ శిక్షణ్ మండల్ ఉన్నాయి. వీటికి చెందిన 20 మంది సభ్యుల బృందం సంస్కృత సబ్జెక్టు ను స్కూళ్లలో తప్పనిసరి చేయాలని కోరిందని టాక్. ప్రతివారం సంస్కృత సబ్జెక్టు కు 6 పీరియడ్స్ ఉండేలా చూడాలని సూచించారట. ఇదే సమయంలో ఆంగ్ల భాషను అత్యుత్తమ ప్రమాణాలతో బోధించేలా చూడాలని కోరారట. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం లో సంస్కృత సబ్జెక్టు చదువుకోని విద్యార్థులకు ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ అండ్ సర్జరీ కోర్సులో ప్రవేశం కల్పించరాదని కూడా ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. జూలై నెలాఖరులోగా మరోసారి గుజరాత్ విద్యా శాఖ మంత్రితో ఆర్ఎస్ఎస్ భేటీ అవుతుందని అంటున్నారు.