Harda Blast: మధ్యప్రదేశ్‌ హర్దాలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

Harda Blast: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. హర్దాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదం 9 ఏళ్ల నాటి పెట్లవాడ ప్రమాదాన్ని గుర్తు చేసింది. ఆ సమయంలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా 79 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని మగర్ధ రోడ్‌లో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిజానికి ఒకదాని తర్వాత ఒకటి బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫ్యాక్టరీలో పటాకుల కోసం గన్‌పౌడర్‌ను ఉంచారని, దీంతో మంటలు వ్యాపించాయని, కొద్దిసేపటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని చెబుతున్నారు.పేలుడు తీవ్ర ఎక్కువ ఉండటంతో శబ్దం చాలా దూరం వరకు వినిపించింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు.

హార్దాలో జరిగిన పేలుడు 9 సంవత్సరాల క్రితం ఝాబువాలోని పెట్లావాడ్‌లో జరిగిన బాణాసంచా ప్రమాదాన్ని గుర్తు చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 79 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.డిసెంబర్ 12, 2015 తెల్లవారుజామున బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 79 మంది మరణించగా, 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విచారణ అనంతరం ఇంట్లో అక్రమంగా ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల వల్లే పేలుడు సంభవించినట్లు తేలింది.

కాగా హార్దాలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా సమీపంలోని 50కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఘటన అనంతరం బేతుల్ జిల్లా నుంచి నాలుగు అగ్నిమాపక దళ వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే భోపాల్‌లోని జేపీ హాస్పిటల్‌లో 6 పడకల వార్డును సిద్ధం చేశారు. వైద్యులందరినీ అత్యవసర విధులకు పిలిచారు. అదే సమయంలో భోపాల్, ఇండోర్, రైసెన్ మరియు సెహోర్‌తో సహా అనేక జిల్లాల నుండి మొత్తం 144 అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Also Read: Medaram : ఆధార్ కార్డు ఉంటేనే ‘బంగారం’ అమ్మబడును