ISRO Launch: నాలుగో దశలో “ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1” సిగ్నల్ మిస్.. విశ్లేషణలో ఇస్రో!

చిన్న ఉపగ్రహ వాహకనౌక "ఎస్‌ఎస్‌ఎల్‌వీ"ని ఇస్రో ఇవాళ ప్రయోగించింది. సాంకేతికంగా దీని పేరు "ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1".

Published By: HashtagU Telugu Desk
Isro Sslv

Isro Sslv

చిన్న ఉపగ్రహ వాహకనౌక “ఎస్‌ఎస్‌ఎల్‌వీ”ని ఇస్రో ఇవాళ ప్రయోగించింది. సాంకేతికంగా దీని పేరు “ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1”. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు “ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1” నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మూడు దశల్లో విజయవంతం అయింది. కానీ నాలుగో దశలో మాత్రం సిగ్నల్ మిస్సైంది.

సంకేతాల కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 అన్ని దశలు అనుకున్న విధంగా పూర్తయ్యాయని.. టెర్మినల్‌ (నాలుగో) దశలో కొంత డేటా నష్టం నిర్ధారణ ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఏర్పాటు. మిషన్‌ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి ఇప్పటివరకు వచ్చిన అని విశ్లేషిస్తున్నామని చెప్పారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? అనే కొంతసేపటిలో స్పష్టత వస్తుందని వివరించారు.

కాగా, మూడో దశ తర్వాత ఈవోఎస్‌-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్‌ వదిలేసింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ అందడం లేదు. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఎస్‌ఎస్‌ఎల్వీ- డీ1 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించడమే ఈ ప్రయోగ లక్ష్యం. ఇందులో అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ(ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లాల పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్‌’ కూడా ఉంది.

  Last Updated: 07 Aug 2022, 11:03 AM IST