మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తాంది. మహారాష్ట్ర – ఝార్ఖండ్ లలో జరిగిన ఎన్నికల కౌటింగ్ (Maharashtra – Jharkhand Elections 2024) కొనసాగుతుంది. మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగగా.. మొత్తం 4,136 మంది బరిలోకి దిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, అజిత్ పవార్-ఎన్సీపీ, ఏకనాధ్ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్, శివ సేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
మొదటి రౌండ్ నుండే మహాయుతి లీడ్ లో కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 204 స్థానాల్లో మహాయుతి అభ్యర్థుల ముందంజ ఉంది. కూటమిలో ప్రధాన పార్టీ బీజేపీ 110 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. శివసేన 56, ఎన్సీపీ 32 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ 80 సీట్లతో చతికిల పడింది. ఇంకా లెక్కింపు జరుగుతుండటంతో ఫలితాలు మారే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో గతంలో ప్రభావవంతమైన ఈ కూటమి, ఈసారి బలహీనపడింది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే ఫాక్షన్) మరియు ఎన్సీపీ (షరద్ పవార్ ఫాక్షన్): కలిపి 80 స్థానాలకు మాత్రమే పరిమితం కావచ్చు. మహారాష్ట్రలో బీజేపీ తన మద్దతు పెంచుకొని, రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాధాన్యాన్ని మరింత బలపరచింది. దీంతో మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. అయితే, కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (షిండే వర్గం) చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (అజిత్ వర్గం) చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also : Elon Musk : 334.3 బిలియన్ డాలర్లతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్