గాంధీ ఆదర్శాలను తెలుసుకుందాం.. గెలుపు బాటలో పయనిద్దాం!

గాంధీజీ అంటే.. ఊరి ప్రధాన సెంటర్లో నిలబెట్టు ఓ విగ్రహం కాదు.. ఆయన జయంతికో, ఆయన వర్ధంతికో పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకునే రోజు అసలే కాదు.. గాంధీ అంటేనే ఒక సిద్ధాంతం.. గాంధీ అంటే ఒక ఆదర్షం.. గాంధీ అంటే ఓ సత్యం. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిర్వచిస్తే... గాంధీకి ముందు, గాంధీకి తర్వాత అని చెప్పక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ లక్ష్యాల కోసం పరుగెడుతూ జీవితంలోని అసలైన మకరందాన్ని మిస్ అవుతున్నారు. ఒక్కసారి గాంధీ జీవితాన్ని తెలుసుకుంటే.. ఎలాంటి కష్టానైనా అధిగమించవచ్చు

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:27 PM IST

గాంధీజీ అంటే.. ఊరి ప్రధాన సెంటర్లో నిలబెట్టే ఓ విగ్రహం కాదు.. ఆయన జయంతికో, ఆయన వర్ధంతికో పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకునే రోజు అసలే కాదు.. గాంధీ అంటేనే ఒక సిద్ధాంతం.. గాంధీ అంటే ఒక ఆదర్షం.. గాంధీ అంటే ఓ సత్యం. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిర్వచిస్తే… గాంధీకి ముందు, గాంధీకి తర్వాత అని చెప్పక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ లక్ష్యాల కోసం పరుగెడుతూ జీవితంలోని అసలైన మకరందాన్ని మిస్ అవుతున్నారు. ఒక్కసారి గాంధీ జీవితాన్ని తెలుసుకుంటే.. ఎలాంటి కష్టానైనా అధిగమించవచ్చు.

ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణశీలిగా, ఆదర్శవాదిగా ఉండగలగడం గాంధీజీలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశం. జీవితాంతం ఆయన వ్యక్తులతో, సమాజంతో, ప్రపంచంతో చర్చోపచర్చలు చేస్తూ సత్యాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. గాంధీలోని గొప్ప సుగుణాల్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం నిర్విరామంగా విలక్షణమైన రీతిలో పోరాడిన ఈ మహామనీషి హత్య వెనుక దాగిన చారిత్రక సందర్భాన్ని వర్తమాన తరాలు అర్థం చేసుకోనట్లయితే భవిష్యత్‌లో ఎలాంటి విపత్కర  పరిస్థితులు తలెత్తినప్పుడు ఎదుర్కోవటం కష్టమవుతుంది.

నాయకత్వం అనగానే.. ప్రతిఒక్కరికి ముందుకు గుర్తుకువచ్చేది గాంధీనే. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది భారతీయులను ఏకం చేసిన ఘనత ఆయనకే దక్కింది. మత ఘర్షణను ఆపాలని భావిస్తే.. ఆయన నిరశన దీక్షకు దిగేవారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడేవారు కాదు. సత్యాగ్రహం టైంలోనూ తన అనుచరులకు హాని కలిగించే పరిస్థితులను ఆయన కల్పించలేదు. ఇప్పటి నాయకులు గాంధీలాగే ఉండాల్సిన అవసరం లేదు కానీ.. ఇప్పటికీ కూడా తాము నమ్మిన సిద్ధాంతాలు, నమ్మకాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా నేటి యువతపై ఉంది.

ఈ రోజుల్లో చాలామందికి ఏ చిన్న అవసరమైనా బైక్ పైనో, కారులోనో వెళ్తున్నారు. కానీ గాంధీజీ ఆ రోజుల్లోనే కేవలం కాలినడక ద్వారా వందల కిలోమీటర్లు వెళ్లేవారు. ఆయన ఆకారం బక్కపలుచగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ కనిపించేవాళ్లు. ఇక అవసరానికంటే మించి తినకపోవడం గాంధీ అలవాట్లలో ముఖ్యమైంది. మితహారం తింటూ ఆరోగ్యానికి కాపాడుకోవానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన ఆయన మాంసాహారం మానేసి, పూర్తిగా శాకాహరిగా మారారు.

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ డబ్బు మయాలో పడి రాత్రికే రాత్రే కోటీశ్వరులు కావాలని పగటి కలలు కంటుంటారు. ఇందుకోసం కొందరు అడ్డదారులు తొక్కెందైనా ఏమాత్రం వెనుకాడటం లేదు. విజయం సిద్ధించాలంటే ఒక్కరోజులోనే సాధ్యంకాదనే విషయం తెలుసుకోవాలి. సహనం, ఓపిక లాంటి లక్షణాలు ఒంటపట్టించుకుంటే విజయం ఈ రోజు ఆలస్యమైనా.. కచ్చితంగా ఏదో ఒకరోజు కచ్చితంగా ఇంటి తలుపు తట్టుతుంది. సరైన సమయం కోసం గాంధీజీ ఎన్నోసార్లు సహనంతో ఉన్నారు. ఈ సూత్రాన్ని నేటి పౌరులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఈ రోజుల్లో చాలామంది లక్షల జీతాలు అందుకుంటున్నా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు. సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే మనిషి జీవితం ఎప్పడూ అంధకారమే. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, అవసరానికి మించి డబ్బూ పోగు చేయడం.. ఈరెండు ప్రమాదమే. గాంధీజీకి మొదట్నుంచి క్రమశిక్షణ ఎక్కువ. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో. ఆయన ఏదీ కూడా అవసరానికి మించి ఖర్చు చేయరు. సమాజంలో స్టేటస్ కోసం పాకులాడరు. అందుకే ఆయన ఓ గోచి ధరించి అతి సామాన్యంగా జీవించారు. ఎన్నో విషయాల్లో ఆయన ఆచరణ్మాతంగా వ్యవహరించారు కాబట్టే మహాత్ముడయ్యారు. మనం కూడా గాంధీ ఆదర్షాలను పాటిద్దాం.. గెలుపు బాటలో పయనిద్దాం.