Site icon HashtagU Telugu

Maharashtra: మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్తత.. రాళ్లదాడితో పలు వాహనాలు దగ్ధం, నగరంలో 144 సెక్షన్ అమలు

Maharashtra

Resizeimagesize (1280 X 720)

మహారాష్ట్ర (Maharashtra)లోని ఓల్డ్ సిటీ అకోలా (Akola)లో వివాదం నెలకొంది. అయితే ఈ చిన్నపాటి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ హింసకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కనిపించింది. దీంతో పాటు వాహనాలను ధ్వంసం చేసి హంగామా సృష్టించారు. మరోవైపు ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

హింసాత్మక ఘర్షణల తర్వాత నగరంలో 144 సెక్షన్

ఈ విషయం గురించి సమాచారం ఇస్తూ అకోలా కలెక్టర్ నీమా అరోరా మాట్లాడుతూ.. రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణల తరువాత నగరంలో 144 సెక్షన్ విధించబడింది. పోలీసు అధికారుల ప్రకారం.. హింసాత్మక గుంపు కొన్ని వాహనాలను ధ్వంసం చేసింది. అనంతరం పోలీసులు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు చిన్న వివాదం తర్వాత హింసాత్మక ఘర్షణ చోటుచేసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘర్షణ అనంతరం పాతబస్తీ పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.

Also Read: Israel-Palestine: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఆగని ఘర్షణలు.. ఇద్దరు పాలస్తీనియన్లు మృతి

పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ సందీప్ ఘుగే తెలిపారు

మరోవైపు ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అకోలా ఎస్పీ సందీప్ ఘుగే తెలిపారు. జిల్లా కలెక్టర్ నీమా అరోరా ఆదేశాల మేరకు అకోలా నగరం మొత్తం 144 సెక్షన్ విధించారు. ఇటీవలి కాలంలో అకోలాలో ఇది రెండవ పెద్ద సంఘటన. కొన్ని రోజుల క్రితం అకోట్ ఫైల్ ప్రాంతంలోని శంకర్ నగర్ ప్రాంతం నుండి హింసాత్మక ఘర్షణల వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.