Site icon HashtagU Telugu

Maharashtra CM Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే

Shinde

Shinde

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు రాజ్‌భవన్‌లో షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చే వారంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న కొత్త మంత్రివర్గంలో తాను భాగం కాబోనని ఫడ్నవీస్ ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే సొంత పార్టీ – శివసేనలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  బలపరీక్షలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోలేరని గ్రహించి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఇతర పార్టీల నేతలు సైతం భావించారు. కానీ అనుహ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది.