Site icon HashtagU Telugu

Corona : కరోనా బారినపడిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

Maharashtra Minister Dhanan

Maharashtra Minister Dhanan

కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా రోజురోజుకు ఉదృతం అవుతుంది. సామాన్య ప్రజలతో పాటు సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్‌ ముండే కరోనా బారిపడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటించారు. అయితే వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్‌ తెలిపారు.

ఈ మేరకు అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్‌ ముండేకు కొవిడ్‌ పాజటివ్‌ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముం‍డేకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. అలాగే ‘కొవిడ్‌ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారని, ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి నుంచే ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె డిసెంబర్ నెలలో ఎక్కువగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. 2020 , 2021 లలో కూడా ఇలాగే డిసెంబర్ నెలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ఇయర్ (2023)లో కూడా అలాగే పెద్ద మొత్తంలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి శీతాకాల పరిస్థితులే కారణమని వైద్యులు చెపుతున్నారు. కరోనా ఎక్కువగా శ్వాస కోశ సమస్య కావడం..చలికాలంలో శ్వాస కోశ సమస్యలు రావడం , అనారోగ్యానికి గురిచేసే పరిస్థితులు శీతాకాలంలో ఎక్కువగా ఉండడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని..డాక్టర్స్ చెపుతున్నారు. ప్రస్తుతం ఈ వేరియంట్ ను చూసి ఖంగారుపడాల్సిన అవసరంలేదని అంటున్నారు.

Read Also : Belt Shops Close : తన పదవి పోయినా మంచిదే బెల్టు షాప్స్ మూయిస్తా – ఎమ్మెల్యే రాజగోపాల్