Maharashtra – Jharkhand Exit Poll 2024 : చాణక్య సర్వే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే..

Maharashtra - Jharkhand Exit Poll 2024 : ఎన్డీఏ కూటమి (బీజేపీ ఆధ్వర్యంలో): 46% పైగా ఓట్లు సాధించి 45–50 సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Chanikya Maharashtra Exit

Chanikya Maharashtra Exit

దేశ వ్యాప్తంగా ఏ ఎన్నికల పోలింగ్ జరిగిన ఆ వెంటనే సర్వేల ( Exit Poll) పై ప్రజలు ఫోకస్ చేస్తుంటారు. ఎంతోమంది..ఎన్నో సంస్థలు తమ సర్వేలకు అనుగుణంగా గెలుపు ఎవరిదీ..? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది..? ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది..? ఎవరు ఎక్కడ విజయం సాదించబోతున్నారు..? ఎంత మేర ఓట్లతో విజయం దక్కించుకోబోతున్నారు..? ఎంత పోలింగ్ శాతం జరిగింది..? ఓటర్ల నాడీ ఎలా ఉంది..? ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాదానాలు చెపుతుంటారు. ముఖ్యంగా చాణక్య సర్వే పై పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు , అలాగే సామాన్య ప్రజలు దృష్టి పెడుతుంటారు. అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో దాదాపు చాణక్య చెప్పిన ఎగ్జిట్ పోల్స్ నిజం అయ్యాయి. దీంతో ఈరోజు మహారాష్ట్ర – ఝార్ఖండ్ లలో జరిగిన ఎన్నికల పోలింగ్ (Maharashtra – Jharkhand Elections 2024) లో చాణక్య సర్వే (Chanakya Exit Poll) ఏంచెపుతుందో తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉన్నారు.

మహారాష్ట్రలో (Maharashtra) మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది మొత్తం 4,136 మంది బరిలోకి దిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. అలాగే ఇదే రోజు ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు గాను రెండో విడత పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ, అజిత్​ పవార్​-ఎన్​సీపీ, ఏకనాధ్​ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్​, శివ సేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్ పవార్​) కలిసి మహావికాస్​ అఘాడీగా ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మహారాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. వివిధ మీడియా, సర్వే సంస్థలు ప్రజల నుంచి వారి అభిప్రాయాలని సేకరించి మహారాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందో ఓ అంచనాకి వచ్చాయి. వాటిని ఎగ్జిట్ పోల్స్ రూపంలో విడుదల చేశాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో భాగంగా చాణిక్య సర్వే మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చింది.

Chanakya Exit Polls – Jharkhand Elections 2024

ఎన్డీఏ కూటమి (బీజేపీ ఆధ్వర్యంలో): 46% పైగా ఓట్లు సాధించి 45–50 సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

మహాగత్‌బంధన్ (జేఎమ్‌ఎమ్, ఐఎన్సీ, ఆర్జేడీ): 38% పైగా ఓట్లు సాధించి 35–38 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గెలిచి సీట్లు :

జేఎమ్‌ఎమ్ (JMM): 26+

బీజేపీ (BJP): 40+

ఐఎన్సీ (INC): 10+

RJD : 3 +

లెఫ్ట్ 1

AJSU : 5 +

జనతాదళ్ 1 +

ఇతరులు: 3–5 గెలిచే అవకాశాలు ఉన్నట్లు చాణక్య తెలిపింది.

Chanakya Exit Polls – Maharashtra Elections 2024

మహారాష్ట్రలో మహాయుతి (బీజేపీ-శివసేన శిండే గ్రూప్) మరియు మహా వికాస్ అఘాడీ (MVA) మధ్య సీట్ల పోరు హోరాహోరీగా ఉంది. మహాయుతి (NDA): బీజేపీ మరియు శిండే నేతృత్వంలోని శివసేన కలసి 152–160 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

మహా వికాస్ అఘాడీ (MVA): కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మరియు ఉద్ధవ్ థాకరే శివసేన కలసి 130–138 , ఇతరులు: 6–8 సీట్లు సాధించే అవకాశం ఉంది.

గెలిచే సీట్లు :

బీజేపీ: 90+

శివసేన (శిండే): 48+

ఎన్సీపీ (అజిత్ గ్రూప్): 22+

కాంగ్రెస్: 63+

ఎన్సీపీ (శరద్ గ్రూప్): 40+

శివసేన (ఉద్ధవ్ గ్రూప్): 35+

ఇతరులు 6 నుండి 8 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు చాణిక్య సర్వే చెపుతుంది.

Chanakya Strategies Survey

  Last Updated: 20 Nov 2024, 06:35 PM IST