NIA Chief : ఎన్ఐఏ, ఎన్డీఆర్ఎఫ్, బీపీఆర్డీలకు కొత్త బాస్‌లు

NIA Chief :  ఓ వైపు ఎన్నికల కోలాహలం మొదలైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియామకాలు చేపట్టింది.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 12:58 PM IST

NIA Chief :  ఓ వైపు ఎన్నికల కోలాహలం మొదలైన వేళ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియామకాలు చేపట్టింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కొత్త చీఫ్‌గా సదానంద్ వసంత్ దేత్‌ను నియమించింది. దీంతో పాటు మరో కీలక విభాగాలకు కూడా కొత్త అధిపతులను నియమించింది.  నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌ (బీపీఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా రాజీవ్ కుమార్ శర్మలను నియమిస్తూ ఉత్తర్వులు(NIA Chief) జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join

కొత్త ఎన్‌ఐఏ చీఫ్ నేపథ్యం..

ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన సదానంద్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31న పదవీ విమరణ చేయనున్న ప్రస్తుత ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా స్థానంలో సదానంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2026 డిసెంబర్ 31 వరకు ఎన్ఐఏ చీఫ్‌గా సదానంద్ వ్యవహరించనున్నారు.

Also Read : Russia Vs West : మాస్కోపై ఉగ్రదాడి పశ్చిమ దేశాల పనే.. రష్యా సంచలన ఆరోపణలు

  • ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న అతుల్ కర్వాల్, బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న బాలాజీ శ్రీ వాస్తవ ఈ నెల 31న పదవీ విమరణ చేయనున్నారు. వీరి స్థానంలో కొత్త చీఫ్‌లుగా పీయూష్ ఆనంద్, రాజీవ్ కుమార్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.
  • పీయూష్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.  ప్రస్తుతం ఈయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. రెండేళ్ల పాటు ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వహించనున్నారు.
  • బీపీఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ శర్మ.. 2026న జూన్ 30 వరకు పదవిలో కొనసాగనున్నారు.

Also Read : Chandrababu: సీఎంగా తొలి సంతకంపై చంద్రబాబు భారీ హామీ..!