Site icon HashtagU Telugu

Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

Maharashtra elections..Congress second list released

Maharashtra elections..Congress second list released

Maharashtra Assembly elections 2024 : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరులో 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. జాబితాలోని చాలా మంది పేర్లు విదర్భ ప్రాంతానికి చెందినవి. నాగ్‌పూర్‌ సౌత్‌ నుంచి గిరీష్‌ పాండవ్‌, వార్ధా నుంచి శేఖర్‌ షిండే, యవత్‌మాల్‌ నుంచి అనిల్‌ మంగూల్కర్‌లకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.

భుసావల్ (ఎస్సీ రిజర్వ్డ్)- డాక్టర్ రాజేష్ తుకారాం మన్వత్‌కర్, జల్గామ్- డాక్టర్ స్వాతి సందీప్ వరెకర్, అకోట్- మహేష్ గంగణె, వార్ధా- శేఖర్ ప్రమోద్ బాబు షిండే, సావనెర్- అనూజ సునీల్ కేదార్, నాగ్‌పూర్ సౌత్- గిరీష్ కృష్ణారావ్ పాండవ్, కమ్టీ- సురేష్ యాదవ్ రావ్ భోయర్, భండారా (ఎస్సీ రిజర్వ్డ్)- పూజా గణేష్ థావ్‌కర్ పోటీలో నిలిచారు.

అర్జునీ-మోర్గావ్ (ఎస్సీ రిజర్వ్డ్)- దిలీప్ వామన్ బన్సోడ్, అమ్‌గావ్ (ఎస్టీ రిజర్వ్డ్)- రాజ్‌కుమార్ లోతుజి పూరం, రలేగావ్- ప్రొఫెసర్ వసంత్ చిందుజీ పుర్కే, యావత్మల్- అనిల్ అలియాస్ బాలాసాహెబ్ శంకర్ రావ్ మంగుల్కర్, అర్ణి (ఎస్టీ రిజర్వ్డ్)- జితేంద్ర శివాజీ రావ్ మోఘె, ఉమర్‌ఖేడ్ (ఎస్సీ రిజర్వ్డ్)- సాహెబ్‌రావ్ దత్తారావ్ కాంబ్లేలకు టికెట్ ఖరారైంది.

జాల్నా- కైలాస్ కిషన్ రావ్ గోర్తంట్యాల్, ఔరంగాబాద్ ఈస్ట్- మధుకర్ కృష్ణారావ్ దేశ్‌ముఖ్, వసై- విజయ్ గోవింద్ పాటిల్, కండీవలి ఈస్ట్- కాలు బధేలియా, ఛార్కోప్- యశ్వంత్ జయప్రకాష్ సింగ్, సియాన్ కోలీవాడా- గణేష్ కుమార్ యాదవ్, షిరంపూర్ (ఎస్సీ రిజర్వ్డ్)- హేమంత్ ఒగలె, నిలంగ- అభయ్ కుమార్ సతీష్ రావ్ సాలుంకే, షిరోల్- గణ్‌పత్ రావ్ అప్పాసాహెబ్ పాటిల్‌ బరిలో దిగారు.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే. ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.

Read Also: Diwali: దివాళి రోజు ఏ దిక్కున దీపాలను వెలిగిస్తే మంచిదో తెలుసా?