Maharashtra Assembly Elections : మహారాష్ట్రలో ప్రచార పర్వం నేటితో సమాస్తం

Maharashtra Assembly Elections : ఈరోజుతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Maharashtra Assembly election campaign) తెరపడనుంది. మొత్తం 288 స్థానాలకు బుధవారం (నవంబర్ 20) ఎన్నికలు జరగనున్నాయి

Published By: HashtagU Telugu Desk
Maharashtra Election Campai

Maharashtra Election Campai

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections in Maharashtra) ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన, NCP వంటి ప్రధాన పార్టీలు అంతర్గత కలహాలతో ఆయా పార్టీలు రెండుగా చీలిపోవడం అందుకు ప్రధాన కారణం. మరి ముఖ్యంగా బాబాయి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చిన అబ్బాయి అజిత్ పవార్ అధికార మహాయుతి ప్రభుత్వంతో చేతులు కలిపారు. NCPచీలిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతిసహా 35స్థానాల్లో బాబాయి, అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి.

ఇక ఈరోజుతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Maharashtra Assembly election campaign) తెరపడనుంది. మొత్తం 288 స్థానాలకు బుధవారం (నవంబర్ 20) ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.93 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మహాయుతి బీజేపీ నాయకత్వంలో శివసేన (ఎక్నాథ్ శిండే), అజిత్ పవార్ NCPతో పటిష్టమైన ప్రచారం చేస్తూ వచ్చింది. మహా వికాస్ అఘాడి ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ NCP, కాంగ్రెస్ కలిసి “ఉచిత విద్య, మహిళల కోసం ప్రతినెల రూ.3,000 వంటి హామీలతో” ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మహాయుతి ప్రభుత్వంలో పరిపాలన వ్యతిరేకత, మహా వికాస్ అఘాడి హామీలు, మరియు లోకల్ సమస్యలతో గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు మూడో వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపుఓటములు నిర్దేశిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి, ఇంతవరకు కలిసి ఉన్న మిత్రులే శత్రువులుగా, శత్రువులే మిత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.

Read Also : Delhi Weather : ఢిల్లీలో గాలి కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఆరెంజ్‌ అలర్ట్‌

  Last Updated: 18 Nov 2024, 11:39 AM IST