Site icon HashtagU Telugu

Maharashtra CM Uddhav: మహా సంక్షోభం.. ఉద్దవ్ ఇంటికే!

Uddav

Uddav

తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరైనా తనను కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. తాను బాల్ థాక్రే కుమారుడ్నినని, తాను ఎప్పుడూ కూడా అధికారం కోసం పాకులాడలేదని, తన ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా కోరితే ఇవ్వడానికి సిద్ధమని ఉద్దవ్ తేల్చి చెప్పారు. బుధవారం రాత్రి సిఎం అధికారిక నివాసం ‘వర్ష’ నుంచి ఆయన నివాసమైన మాతోశ్రీ బంగ్లాకు బయలుదేరారు. శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో పెరుగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య, ఉద్ధవ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇలా అన్నారు. “వారు వచ్చి కోరితే నేను నా రాజీనామా లేఖను సమర్పిస్తాను. నేను సీఎంగా కొనసాగకూడదని ఎవరైనా ఎమ్మెల్యే కోరుకుంటే, వర్ష బంగ్లా (సీఎం అధికారిక నివాసం) నుంచి మాతోశ్రీకి (సొంత భవనం)  నా వస్తువులన్నీ తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అంటూ రియాక్ట్ అయ్యారు.

ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన శివసేన ఎమ్మెల్యేల సంఖ్యపై ఊహాగానాలపై శివసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు. “MVA ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లలో సంకీర్ణ భాగస్వాములు మాత్రమే లబ్ధి పొందారు. ఈ విషయంలో  శివసైనికులు నిరాశకు గురయ్యారు. మా మిత్రపక్షాలు బలపడుతుండగా, శివసేన, సైనికులను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారు. పార్టీ, సైనికుల మనుగడ కోసం, ఈ అసహజ కూటమి నుండి వైదొలగాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. విడిపోయిన వర్గానికి చెందిన 34 మంది శివసేన ఎమ్మెల్యేలు, శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకనాథ్ షిండేను నియమిస్తూ తీర్మానం చేశారు. ఉద్దవ్ చర్యతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం దేశం మొత్తం మహరాష్ట్రలో ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Exit mobile version