Trust Vote:`మ‌హా` ప‌రీక్ష‌లో నెగ్గిన షిండే

మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు.

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 12:55 PM IST

మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. మొత్తం 288 మంది సభ్యులున్న సభలో 164 మంది ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, 99 మంది వ్యతిరేకంగా ఓటు వేశాబరు. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో విజయం సాధించారు.

మెజారిటీ ఓటుతో విశ్వాస పరీక్ష జరిగినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఇటీవల శివసేన ఎమ్మెల్యే మరణించిన తర్వాత, ప్రస్తుత అసెంబ్లీ బలం 287కి తగ్గింది, తద్వారా మెజారిటీ మార్క్ 144. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజు జూన్ 30న షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా అధికారాన్ని కాపాడుకున్నారు. అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు. బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు. మెజారిటీ ఓటుతో విశ్వాస పరీక్ష జరిగినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.