Site icon HashtagU Telugu

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్ ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే. లోక్‌సభలో ఒవైసీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితీష్ రాణే మీడియాతో మాట్లాడారు.

నితీష్ రాణే మాట్లాడుతూ.. పాక్ పార్లమెంట్‌లో ఎవరైనా జై శ్రీరామ్ లేదా వందేమాతరం అంటూ నినాదాలు చేసి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలతో బయటికి వచ్చేవారు కాదు. కానీ మనం ఆరాధించే పార్లమెంటులో, మనం విశ్వాసపాత్రంగా ఉన్న దేశంలో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిచే దేశంలో శత్రు దేశాలు లేదా తీవ్రవాదులకు మద్దతుగా గొంతులు వినాల్సి వస్తుందని ఓవైసీపై ఫైర్ అయ్యారు. ఈ నినాదాలు చేసే వారిని పార్లమెంట్ నుంచి బయటకు రానివ్వకూడదు. పాకిస్తానీ లేదా చైనా ప్రజలు తమ పార్లమెంట్‌లలో దీనిని అనుమతించరని పేర్కొన్నాడు.

అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసి నా దగ్గరకు తీసుకురండి, నేను మీకు బహుమతి ఇస్తాననని ప్రకటించారు నితీష్. జై పాలస్తీనా అంటూ పార్లమెంటు నుంచి ఒవైసీ స్వేచ్ఛగా ఎలా వెళ్లిపోయారు? ఇలాంటి పని చేసే వ్యక్తిని ఏ దేశం కూడా సజీవంగా వదలదని సంచలన కామెంట్స్ చేశారు నితీష్. జూన్ 25న పార్లమెంటు సభ్యునిగా ఒవైసి ప్రమాణం చేసిన తర్వాత వరుస వివాదాలు చెలరేగాయి. అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో తన ప్రమాణం ముగింపులో జై ఎంఐఎం, జై భీమ్, జై తెలంగాణ మరియు తక్బీర్ అల్లా హు అక్బర్’తో పాటు ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తారు.

Also Read: Palla Srinivasa Rao: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు