Live In Partner Murder : అతగాడు రాక్షసుడి కంటే దారుణంగా ప్రవర్తించాడు. తనతో సహ జీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ఫ్రిజ్‌లో దాదాపు 8 నెలలు పెట్టాడు. తాజాగా శుక్రవారం రోజు ఆమె డెడ్‌బాడీని ఫ్రిజ్ నుంచి వెలికితీశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ఈ హత్యకు పాల్పడిన సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఉజ్జయిన్ పట్టణ వాస్తవ్యుడు. హత్యకు గురైన మహిళను పింకీ ప్రజాప్రతిగా గుర్తించారు. 2024 సంవత్సరం జూన్‌లోనే పింకీని సంజయ్ పాటిదార్ మర్డర్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.
Also Read :CM Yogi : ‘‘సీఎం యోగి తలను నరికేస్తా..’’ వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్ట్ కలకలం
సంజయ్ పాటీదార్ వివాహితుడే. అతడితో పింకీ ప్రజాప్రతి గత ఐదేళ్లుగా సహ జీవనం చేస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలని పింకీ ఒత్తిడి చేసింది. దీంతో తన స్నేహితుడి సహాయంతో సంజయ్ ఆమెను హత్య చేసి ముక్కలు చేశాడు. చేతులు, మెడ, కాళ్లను నరికేసి కవర్లలో పెట్టి.. ఫ్రిజ్‌లో దాచాడని దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్యకు ముందు సంజయ్ పాటీదార్, పింకీ ప్రజాప్రతి కలిసి వెళ్లి 2023 జూన్‌లో ఉజ్జయినిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తామిద్దరం భార్యాభర్తలమని ఇంటి ఓనర్ ధీరేంద్ర శ్రీవాస్తవకు చెప్పారు. ధీరేంద్ర శ్రీవాస్తవ ఇండోర్ నగరంలో నివసిస్తున్నాడు. సంజయ్ పాటీదార్ చెప్పింది నిజమేనని నమ్మి.. తన ఇంటిని ధీరేంద్ర శ్రీవాస్తవ అద్దెకు ఇచ్చాడు. ఇరుగుపొరుగు వారితో తాము భార్యాభర్తలమే అని సంజయ్, పింకీ చెప్పుకునేవారట. ఇక పింకీని హత్య చేసిన తర్వాత ఈ ఇంటిని సంజయ్(Live In Partner Murder) ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అయితే తన సామాన్లను స్టడీరూమ్, మాస్టర్ బెడ్‌రూంలలో ఉంచాడు. త్వరలోనే తిరిగొచ్చి ఆ సామాన్లను కూడా తీసుకెళ్తానని ఇంటి ఓనర్ ధీరేంద్ర శ్రీవాస్తవకు సమాచారం అందించాడు.
Also Read :Samantha : చికెన్ గున్యా, కీళ్ల నొప్పులపై సమంత పోస్ట్ వైరల్
అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో అద్దెదారుడు.. తాళం వేసి ఉన్న ఒక పోర్షన్‌ను చూపించాలని ఇంటి యజమాని ధీరేంద్రను అడిగాడు. ఇంతకుముందు సంజయ్ ఉన్న గదిని ఇంటి యజమాని చూపిస్తూ.. అందులో ఉన్న ఫ్రిజ్ బటన్‌ను గత బుధవారం రోజు (జనవరి 8న) ఆఫ్ చేశాడు. దీంతో మరుసటి రోజు ఆ పోర్షన్‌లో నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో ఆ గదిని తెరిచి ఫ్రిజ్‌ను చూడగా.. అందులో పింకీ డెడ్‌బాడీ కుళ్లిపోయిన స్థితిలో ముక్కలుముక్కలుగా కనిపించింది. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. దర్యాప్తు చేసిన పోలీసులు సంజయ్‌ను అరెస్టు చేశారు.