Site icon HashtagU Telugu

Massive Accident : మధ్యప్రదేశ్‌ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..

Accident (1)

Accident (1)

Massive Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. థాంద్లా-ఝాబువా రహదారిపై ఓ ఈకో కారుపై భారీ ట్రాలా బోల్తా పడడంతో, అందులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాలకి చెందిన 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినవారిలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో మహిళ, బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ కుటుంబాలు ఝాబువా సమీపంలోని భావ్‌పురా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ విషాదం వాటిల్లింది. ఘటన చోటుచేసుకున్నది రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య. ఈకో కారు (GJ09BL5956) మధురమైన జ్ఞాపకాలతో ఇంటికి చేరుతుందనుకున్న కుటుంబం కొద్ది నిమిషాల్లోనే మృత్యువుతో ముడిపడింది. నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే ఫాటక్ సమీపంలో ట్రాక్ అకస్మాత్తుగా కారుపై పడిపోయింది. దీంతో కారు పూర్తిగా ట్రాక్ కింద నలిగిపోయింది.

పోలీసుల ప్రకారం మృతుల్లో ముఖేష్ (40), అతని భార్య సావ్లీ (35), కుమారుడు వినోద్ (16), కుమార్తె పాయల్ (12), మడి (38), ఆమె కుమారుడు విజయ్ (14), కాంతా (14), రాఘిని (9), అకలి (35) ఉన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాల్లో పలువురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత విషాదం కలిగిస్తోంది.

Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన త‌ర్వాత కోహ్లీ తొలి పోస్ట్‌