MP CM Oath Ceremony : మధ్యప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ యాదవ్

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 12:05 PM IST

మధ్యప్రదేశ్ సీఎం గా మోహన్‌యాదవ్‌ (Mohan Yadav) (58) ప్రమాణ స్వీకారం చేసారు. రీసెంట్ గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బిజెపి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీటిలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గెలుపు చాల ప్రత్యేకం. ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. గతం కంటే భారీ మెజారిటీతో బీజేపీ (BJP) విజయాన్ని అందుకుంది. అటూ ఇటుగా 2 దశాబ్దాలపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదని ఈ ఫలితాలు నిరూపించాయి. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం చత్తీస్‌గఢ్ (Chhattisgarh
) బాటలోనే మధ్యప్రదేశ్‌లోనూ ముఖ్యమంత్రిని మార్చింది.

తమకు కంచుకోటలాంటి రాష్ట్రంలో.. ఉద్ధండులైన నాయకులను కాదని, మోహన్‌యాదవ్‌ (58)ను సీఎంగా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పక్కన పెట్టింది. డిప్యూటీ సీఎంలుగా జగ్దీష్‌ దేవ్‌రా (మల్హాఘర్‌), రాజేశ్‌ శుక్లా (రేవా)లను ఎంపిక చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చింది. ఛత్తీ్‌సగఢ్‌లో ఆదివాసీ నేత విష్ణుదేవ్‌ సాయ్‌ను సీఎంగా ప్రకటించిన బిజెపి అధిష్టానం.. మధ్యప్రదేశ్‌లో బీసీ యాదవ వర్గానికి చెందిన నాయకుడికి పట్టం కట్టింది.

ఇక నేడు బుధవారం (డిసెంబర్ 13,2023) మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణు సాయి ప్రమాణస్వీకారం చేసారు. భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండులో మోహన్ యాదవ్, రాయపూర్ నగరంలోని సైన్స్ కళాశాల మైదానంలో విష్ణు సాయి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. భోపాల్​లో గవర్నర్​ మంగుభాయ్​ మోహన్ యాదవ్ తో ప్రమాణం చేయించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉపముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్​ దేవ్డాతో పాటు పులువురు మంత్రులు సైతం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు భోపాల్​లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు మోహన్ యాదవ్​. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి పండిత్​ దీన్​దయాళ్​ ఉపాధ్యాయ్​, శ్యామా ప్రసాద్​ ముఖర్జీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు.

మోహన్‌ యాదవ్‌ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. సరిగ్గా పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో అప్పటి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ ప్రభుత్వం ఆయనను కేబినెట్‌ మంత్రిగా నియమించి ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి గెలిచారు.

Read Also : YS Sharmila: ఏపీ రాజకీయాలపై షర్మిల బాణం, కాంగ్రెస్ లో కీ రోల్!