Madhya Pradesh CM : మూత్ర విసర్జన బాధితుడికి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhya Pradesh CM) శివరాజ్ సింగ్ చౌహాన్ మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి సత్కరించారు.

Madhya Pradesh CM : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్‌ పాదాలు కడిగి సత్కరించారు. జరిగిన అవమానవీయ ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. సిద్ధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే నిందితుడు దాస్మేష్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఇందుకు చేందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ స్వయంగా స్పందించి నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయమని ఆదేశించారు. నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అయన హెచ్చరించారు.

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. బాధిత కూలీని కలవడానికి ముందు సీఎం మాట్లాడుతూ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తన హృదయం బాధతో నిండిపోయిందని పేర్కొన్నారు. బాధితుడిని, ఆయన కుటుంబాన్ని భోపాల్‌లో కలవనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత దాస్మేష్‌ను కలిసిన మధ్యప్రదేశ్ సీఎం (Madhya Pradesh AM) ఆయన కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు తెలిపారు.

Also Read:  Tomatoes Stolen: రూ. 2.5 లక్షల విలువైన టమాటాలు దొంగతనం.. ఘటన ఎక్కడ జరిగిందంటే..?