Site icon HashtagU Telugu

PM Modi: మేం వచ్చాకే ప్రజాస్వామ్యం బలోపేతమైంది : మోడీ

Pm Modi

Pm Modi

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ వేదికగానూ పలు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతోందని.. ఈవ్యవధిలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎంతో బలోపేతం చేశామని తెలిపారు. దేశం అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్రను పోషించే ప్రజాస్వామ్యాన్ని తాము పరిపుష్టం చేయగలిగినట్లు పేర్కొన్నారు.

‘ క్వాడ్’ దేశాల సదస్సులో పాల్గొనేందుకు జపాన్ కు వచ్చిన ఆయన టోక్యోలో సోమవారం ప్రవాస భారతీయులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వం ఇప్పుడు అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందని మోడీ చెప్పారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. క్వాడ్ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల అధినేతలతో మోడీ భేటీ కానున్నారు. ఈసందర్భంగా పరస్పర సహకారంపై , ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై వారు చర్చించనున్నారు. కాగా, ప్రధాని మోడీ టోక్యో లోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు.

అక్కడి వచ్చి నిలబడిన పలువురు ప్రవాస భారతీయులను ఆయన నేరుగా వెళ్లి కలిశారు. ఓ బాలిక తాను గీసిన డ్రాయింగ్ ను చూపించగా.. దానిపై ప్రధాని మోడీ ఆటో గ్రాఫ్ ఇచ్చారు. మువ్వన్నెల జెండా చేతపట్టుకొని నిలబడిన ఒక బాలుడితో మోడీ మాట్లాడారు. అతడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరును ప్రధాని కొనియాడారు.