300 Indians in Job Fraud: ఐటీ ఉద్యోగాల మోసం.. బందీగా 300 మంది భారతీయులు?

తాజాగా మయన్మార్ ఒక దారణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ లో ఐటిఐ ఉద్యోగాల పేరుతో వలవేసి

  • Written By:
  • Updated On - September 20, 2022 / 05:03 PM IST

తాజాగా మయన్మార్ ఒక దారణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ లో ఐటిఐ ఉద్యోగాల పేరుతో వలవేసి పలువురు ఒక ముఠా మయన్మార్ లో బంధించినట్టుగా తెలుస్తోంది. ఆ భారతీయులలో 60 మంది తమిళనాడుకు చెందినవారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 300 మంది భారతీయులు ఆ ముఠా దగ్గర బందీలుగా ఉన్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే అక్కడ సైబర్ క్రైమ్ కార్యకలాపాలు చేసేలా తమపై ఒత్తిడి తెస్తున్నారని, మాట వికనపోతే తమపై భౌతిక దాడులకు దిగుతున్నట్టు వాళ్లు తమ కుటుంబ సభ్యులకు తెలిపారట.

రోజుకు 15 గంటలు పనిచేయాలని బలవంతం చేస్తున్నారని, చేయము అని ఒకవేళ వారికి ఎదురు చెబితే కరెంట్ షాక్ పెట్టి హింసిస్తున్నట్టుగా తెలిపారుట. మ్యావాడీ అనేది మయన్మార్ ప్రభుత్వ పరిధిలో ఉండదని, ఆ ప్రాంతం సాయుధ బలగాల డామినేషన్ ఉంటుంది. అయితే అమ్ముట చర నుంచి కాపాడమని వారి కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారట. అయితే కొన్ని ముఠాలు ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులను వలలో తీసుకోవాలని చూస్తున్నాయని కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి అని మయన్మార్ లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరికలను జారీ చేసింది.

కాగా ఇప్పటి వరకు ఇలాంటి ఘటనల్లో ముప్పై మందిని కాపాడి స్వదేశానికి తీసుకు వచ్చినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. తాజాగా పలువురు ఫిర్యాదులు చేశారని, మయన్మార్ ప్రభుత్వంతో భారత రాయభార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వారిని విడిపించి సురక్షితంగా తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు.