Lumpy Skin Disease: దేశాన్ని వణికిస్తోన్న లంపీ వైరస్…67వేల పశువులు మృతి..!!

భారత్ లో లంపీ వైరస్ వ్యాప్తించిందని...దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ పెరిగిందని కేంద్రం చెబుతోంది.

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 08:57 AM IST

భారత్ లో లంపీ వైరస్ వ్యాప్తించిందని…దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ పెరిగిందని కేంద్రం చెబుతోంది. దాదాపు 67వేల పశువులు ఈ వైరస్ తో చనిపోయినట్లు పేర్కోంది. దేశంలో పశువులకు ఈ ఏడాది జూలైతో లంపీ చర్య వ్యాధి వ్యాపించడం మొదలైంది. 8 రాష్ట్రాలకు ఈ వైరస్ విస్తరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పశువులకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర ఏర్పాట్లు చేస్తోంది.

లంపీ చర్మ వ్యాధికి సంబంధించి పూర్తిస్థాయి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆయా రాష్ట్రాల్లో గోట్ పాక్స్ వ్యాక్సిన్ను పశువులకు ఇస్తున్నట్లు కేంద్ర పశుసంవర్థక శాఖ సెక్రెటరీ జతింద్రనాథ్ తెలిపారు. ఈ వైరస్ కోసం ప్రత్యేకంగా జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో లంపీ ప్రోవాక్ ఇండ్ ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 3 లేదా 4 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.

ప్రస్తుతం ఈ వైరస్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యాణా, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తిచెందింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఒకటి రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్ లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు. రాజస్థాన్ లో రోజుకు 7వందల పశువులు చనిపోతున్నట్లు తెలిపారు. గోట్ పాక్స్ వ్యాక్సిన్ లంపీ వైరస్ పై సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటివరకు కోటిన్నర పశువులకు ఈ వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు.