Site icon HashtagU Telugu

Ludhiana Blast : లూథియానా పేలుడు వెనుక ఖ‌లిస్తాన్ క్లూ

Court Blast

Court Blast

పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన పేలుడు వెనుక ఖ‌లిస్టానీ ఉద్య‌మ‌కారులు ప్ర‌మేయం ఉంద‌ని ఆ రాష్ట్ర పోలీస్ అనుమానిస్తోంది. పేలుడు కు సంబంధించిన ద‌ర్యాప్తులో గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ మేర‌కు పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయ వెల్ల‌డించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పాత్ర కూడా ఉందని ఆయ‌న అనుమానిస్తున్నాడు.నిందితుడు పంజాబ్ పోలీసు ఉద్యోగి కావ‌డంతో చెక్ పాయింట్లు, చెకింగ్ నుండి తప్పించుకోవడం అతనికి తెలుసు. బాంబు అతని కడుపుకు కట్టుకున్నాడు. నిందితుడు గగన్‌దీప్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్నాడ‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. స్పాట్ నుంచి చిరిగిన బట్టలు, సిమ్ కార్డ్, మొబైల్ , చేతిపై టాటూ ఆధారంగా ద‌ర్యాప్తు వేగంగా జ‌రుగుతోంద‌ని డీజీపి వెల్ల‌డించాడు. లూథియానా కోర్టు పేలుడు వెనుక పాకిస్థాన్ మద్దతు ఉన్న ఖలిస్థాన్ అనుకూల సంస్థ బబ్బర్ ఖల్సా హస్తం ఉన్నట్లు ప్రాథ‌మిక ఆధారాల‌ను పోలీస్ సేక‌రించింది. నిందితుడు పోలీసుశాఖ స‌స్పెండ్ చేసిన గ‌గ‌న్ దీప్ గా గుర్తించారు. పేలుడుకు సంబంధించిన వివ‌రాల‌ను గగన్‌దీప్ నుంచి రాబ‌డుతున్నారు. మొత్తం మీద 24 గంట‌ల్లో లూథియాన పేలుడు ఘ‌ట‌న నిందితుడ్ని ప‌ట్టుకోవ‌డం ఆ రాష్ట్ర పోలీస్ విజ‌యంగా భావిస్తున్నారు.